భారతదేశంలో క్రికెటర్లకు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు అవినాభావ సంబంధం చాలేనే వుందని చెప్పాలి. సెలబ్రిటీలుగా ఈ రెండు వర్గాల ప్రజలను ప్రజలు నిత్యం ఆరాధిస్తూనే వుంటారని కాబోలు ఈ అవినాభావసంబంధం మరింత ధృఢపడి మనుముందుకు దూసుకుపోతోంది. వివాహబంధంతోను ముడిపడింది. విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మ ప్రేమాయణం ఒక్కటే కాదు అంతకు ముందు అనేక జంటలు ఈ రెండు వినోదపు విభాగం నుంచి ఒక్కటయ్యాయి. ఇప్పుడు తాజాగా రాధిక కూడా తన ఇంటికి క్రికెటర్ నే అల్లుడిగా తెచ్చుకుంటోంది.
నిన్నటితరం తరం మోస్ట్ పాపులర్ తారల్లో ఒకరైన రాధిక.. భారత క్రికెటర్‌కి అత్త కాబోతున్నారు. అవును, రాధిక, శరత్ కుమార్ కుమార్తె రయానేకి.. టీమిండియా ఏ జట్టు సభ్యుడు, ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్ అభిమన్యు మిథున్‌తో వివాహం జరగబోతోంది. అమ్మా రాధికా అనుకోకండి.. ఎందుకంటే ఈ కార్యం కూడా కార్యరూపం దాల్సించి ప్రేమాయణంతోనే. రాధిక కూతురు రాయానే, అభిమన్యే మిధున్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ పెద్దలు చెప్పడం.. వారి వారి ఇళ్లలో ఒప్పించడం కూడా జరిగిపోయింది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా ఇరువురి పెద్దలు కూర్చోని వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ నెల 23వ తేదీ నిశ్చితార్ధం జరుగనుంది. ఆ రోజునే పెళ్లి తేదీ ఖరారు చేస్తారు. క్రికెటర్‌తో తన కూతురు వివాహాన్ని రాధిక ఖరారు చేశారు. రయానే పెళ్లి వేడుక కోసం ఆమె చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా, రయాన్ లండన్‌లో లీడ్స్ విశ్వవిద్యాలయంలో ఎంఏ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదివింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more