ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐకి ఆర్థిక అవసరాలు అందించడమే కాకండా ఆ సంస్థను ప్రపంచంలోనే ధనిక బోర్డుగా మలచిన అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా హఠాన్మరణంతో బీసీసీఐ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బీసీసీఐలో సుదీర్ఘ అనుభవం ఉన్న దాల్మియా హఠాత్తుగా తుది శ్వాస విడివడంతో.. ఇప్పుడు బోర్డు పగ్గాలు చేపట్టేదెవరు? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ బోర్డు కార్యదర్శియే పగ్గాలు చేపట్టే అవకాశం వుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
నిజానికి.. బోర్డు చైర్మన్ లేని సమయంలో బోర్డు కార్యదర్శిదే కీలక భూమిక వుంటుంది. అంతేకాదు.. అధ్యక్ష పదవి ఖాళీ అయిన 15 రోజుల్లోగా బోర్డును సమావేశపరచి, కొత్త అధ్యక్షుడి ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సింది కూడా కార్యదర్శే. దీంతో ప్రస్తుతం కార్యదర్శి పదవిలో ఉన్న అనురాగ్ ఠాకూర్... నిబంధనల మేరకు సమావేశం ఏర్పాటు చేస్తారా? లేక సుప్రీంకోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తారా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు.. తానే అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఠాకూర్ పావులు కదుపుతున్నారన్న వాదనలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బోర్డులో ఉన్న వాతారణం ఠాకూర్ ఎన్నికకు అనుకూలంగానే వుందని విశ్లేషణలు తెలుపుతున్నాయి.
ఈ అధ్యక్ష పదవి ఠాకూర్ తోపాటు రేసులో రాజీవ్ శుక్లా ముందు వరుసలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఈ కాంగ్రెస్ నేతకు ఈశాన్య రాష్ట్రాల బోర్డుల మద్దతు లభించాల్సి ఉంది. ఇక గ్వాలియర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతం రాయ్ పేరు కూడా వినిపిస్తోంది కానీ.. ఆయనకు బీసీసీఐలో మెజారిటీ మద్దతు లేదు. ఢిల్లీ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న సీకే ఖన్నా పరిస్థితి కూడా అలానే ఉంది. దీంతో ఠాకూర్ కే చైర్మన్ పదవి లభించడం ఖాయమని తెలుస్తోంది. మరి.. చివరికి ఫలితాలు ఎలా వెలువడుతాయో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more