ఏదైనా ఒక విషయంలో క్లారిటీ రావాలంటే.. అందుకు తగ్గ ఆధారాలు కచ్చితంగా వుండాల్సిందే! ఈ విషయాన్ని పసిగట్టిన ఇంగ్లండ్ డాషింగ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్.. దాన్ని తనదైన శైలిలో ఆచరణ చేసి చూపించాడు. త్వరలో యూఏఈలో జరిగే పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆ ఇంగ్లండ్ ఆటగాడు పాల్గొంటాడా? లేదా? అని సందేహాలు గతకొన్నాళ్ల నుంచి చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కెవిన్ తాను కూడా ఆ లీగ్ లో పాల్గొంటానని స్పష్టం చేశాడు. అది కూడా తన వీడియో తీసి మరి తాను పాల్గొంటానని సందేశాన్ని పంపాడు.
తనకు లీగ్ లు ఆడటం కొత్తేమీకాదని.. ఇప్పటికే భారత్ లో జరిగే ఐపీఎల్లో అనేక మ్యాచ్ లు ఆడిన సంగతిని పీటర్సన్ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నిర్వహించిన పీఎస్ఎల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఓ వీడియో సందేశాన్ని పీటర్సన్ పంపాడు. తాను పీఎస్ఎల్ కు కచ్చితంగా అందుబాటులో ఉంటానని పీటర్సన్ తెలియజేశాడు. ఈ పోటీల్లో పాల్గొనటానికి తాను ఎంతో ఆతృతగా ఉన్నానన్నాడు. అతి త్వరలో ఆరంభం కానున్న పాకిస్థాన్ ఈవెంట్ లో సందడి చేస్తానన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ తరువాత కరేబియన్ లీగ్ లో ఆడిన పీటరసన్.. నవంబర్ లో సౌతాఫ్రికాలో జరిగే రామ్ స్లామ్ ట్వంటీ 20 మ్యాచ్ ల్లో కూడా ఆడనున్నాడు.
ఇదిలావుండగా.. భారత్ లో నిర్వహించిన ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. దీంతో దీని తరహాలోనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ టీ20 సూపర్ లీగ్ ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న దోహా (ఖతార్) వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. దాదాపు 20 రోజులపాటు జరిగే మొదటి సీజన్ లో మొత్తం ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. టోర్నీ మొత్తం మీద 24 మ్యాచ్ లు జరుగుతాయి. ఇక ఈ టోర్నీకి ప్రచారకర్తలు (బ్రాండ్ అంబాసిడర్లు)గా మాజీ క్రికెటర్లు వసీం అక్రం, రమీజ్ రాజాలు నియమితులయ్యారు.
క్రికెట్‌ను వెర్రిగా ప్రేమించే దక్షిణాసియా దేశాల్లో భారత్ తర్వాత ఎక్కువ మంది అభిమానులున్నది పాకిస్థాన్‌లోనే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్థాన్ ఈ సూపర్ లీగ్ ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ పోటీలకు ఐపీఎల్ తరహాలో ఆదరణ లభిస్తుందా? లేదా? అనేది సందేహమే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more