Indian batsmen must play Tahir properly: Sachin Tendulkar

Watch out for leggie imran tahir cautions sachin tendulkar

sachin tendulkar, sachin tendulkar india, india vs south africa, south africa india, sachin tendulkar imran tahir, imran tahir sachin tendulkar, south africa, tahir imran, sachin tendulkar, Cricketers Kapil movie, Harbhajan singh, Dhoni, Virat Kohli, Sureah Raina, Saina nehwal, team india, MS Dhoni,virat kohli, bangalore, chinaswamy stadium

Sachin Tendulkar advised the young crop of players to trade Imran Tahir with caution

ఇమ్రాన్ తాహీర్ ను జాగ్రత్తాగా ఎదుర్కోవాలి: సచిన్

Posted: 09/26/2015 06:47 PM IST
Watch out for leggie imran tahir cautions sachin tendulkar

దక్షిణాఫ్రికా లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌తో జాగ్రత్త అంటూ టీమిండియా బ్యా ట్స్‌మెన్‌ను సచిన్‌ టెండూల్కర్‌ హెచ్చరించాడు. ప్రపంచ టాప్‌ స్పిన్నర్లలో తాహిర్‌ ఒకడని, అతని బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అప్రమత్తం గా ఉండాలని మాస్టర్‌ సలహా ఇచ్చాడు. ‘ఇమ్రాన్‌ నాణ్యమైన స్పిన్నర్‌. సఫారీలకు అతనే ప్రధాన స్పిన్నర్‌. ఈ టూర్‌లో అతనే ఎక్కువ వికెట్లు తీసే అవకాశం ఉంది. కాబట్టి తాహిర్‌ బౌలింగ్‌ను భారత ఆట గాళ్లు జాగ్రత్తగా ఆడాలి. ప్రస్తుత టీమిండియా కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ప్రతిభావంతులు, అంకితభావం గల యువ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

క్రికెట్‌లో రాణించడానికి ఎంతో ప్రతిభ ఉండాలి. దీనికి అడ్డదారి అంటూ ఏమీ ఉండదు. ఇక ఇరు జట్ల మధ్య టీ20, వన్డే సిరీస్‌ పోరు ఆసక్తికరంగా ఉంటుం దని భావిస్తున్నా. దక్షిణాఫ్రికా ఎప్పటికీ కఠిన జట్టే. ఇప్పటికీ అందులో ఎటువంటి మార్పులేదు. పర్యాటక జట్టుకు డివిల్లీర్స్‌, ఆమ్లా తదితరులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బౌలింగ్‌ విభాగంలో డేల్‌ స్టెయిన్‌, మోర్కె మోర్కెల్‌ ఉన్న సంగతి కూడా మర్చిపోవద్ద’ని 42 ఏళ్ల సచిన్‌ తెలిపాడు. ఈ పర్యటనలో ఆతిథ్య భా రత్‌తో దక్షిణాఫ్రికా మూడు టీ20, ఐదు వన్డే లు, నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో పోటీపడనుంది.

కాగా, ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా 1993లో దక్షిణాఫ్రికాతో జరిగిన హీర్‌ కప్‌ సెమీఫైనల్‌ను జీవితంలో ఎప్పటికీ మార్చిపోలేనని సచిన్‌ అన్నా డు. ఆ ఉత్కంఠ మ్యాచ్‌లో భారత్‌ 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. ‘దక్షిణాఫ్రికా తొలిసారి 1991లో భారత్‌ పర్యటనకు వచ్చింది. ఆ జట్టుపై ఆడడం గొప్ప అనుభవం. ఇక ఈడె న్‌లో వేలాది మంది ప్రేక్షకుల మధ్య ఆడాల్సి రావడం వాళ్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చే సింది. తర్వాత 1992లో దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లినప్పుడు మాకు డర్బన్‌లో ఘన స్వాగతం లభించింది. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి 30 కిలోమీటర్ల వరకూ ప్రజలు రోడ్డు పక్కని నిల్చుని భారత ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపార’ని సచిన్‌ చెప్పుకొచ్చాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  MS Dhoni  virat kohli  south africa  tahir imran  sachin tendulkar  

Other Articles