England Pacer James Anderson Given Counter Attack On Misbah Ul Haq Comments | Pakistan vs England

James anderson counter attack on misbah ul haq comments

misbah ul haq news, james anderson news, misbah ul haq latest updates, misbah ul haq interview stills, pakistan vs england, james anderson controversy

James Anderson Counter Attack On Misbah Ul Haq Comments : England Pacer James Anderson Given Counter Attack On Misbah Ul Haq Comments.

పాక్ కెప్టెన్ కి కౌంటరిచ్చిన ఇంగ్లిష్ ఆటగాడు

Posted: 10/12/2015 04:51 PM IST
James anderson counter attack on misbah ul haq comments

పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లకు కాస్త నోటిదూల ఎక్కువన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమకంటే ‘పోటుగాళ్ళు’ మరెవ్వరూ లేనంతగా అప్పుడప్పుడు వాళ్లు సంచలన వ్యాఖ్యలు గుప్పిస్తుంటారు. ఈ తరహాలోనే తాజాగా పాక్ కెప్టెన్ మిస్బా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మీద వ్యాఖ్యలు చేయగా.. ఆ జట్టు పేసర్ జేమ్స్ అండర్సన్ తనదైన స్టైల్లో అతనికి కౌంటరిచ్చాడు.

మంగళవారం నుంచి పాకిస్తాన్-ఇంగ్లండ్ క్రికెట్ల జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల ఆటగాళ్లు అప్పుడే మాటల యుద్ధానికి దిగారు. ప్రస్తుతమున్న ఇంగ్లండ్ జట్టు చాలా బలహీనంగా వుందని పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 2012లో పాకిస్థాన్ ఓడించిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కంటే ప్రస్తుతం తమతో తలపడుతున్న ఇంగ్లిష్ టీమ్ బలహీనంగా ఉందని  తెలిపాడు. అంతేకాదు.. తొలి టెస్టు గెలవడంతోపాటు సిరీస్ తామే కైవసం చేసుకుంటామని పేర్కొన్నాడు. తమ జట్టు చాలా దృఢంగా వుందని, ఆటగాళ్లందరూ మునుపటిలా కాకుండా పటిష్టంగా ఆడుతూ ఇంగ్లండ్ జట్టును మట్టి కరిపిస్తారని అభిప్రాయాన్ని వెల్లడించాడు. తామే ఖచ్చితంగా గెలుస్తామని బల్లగుద్దిమరీ చెప్పాడు. ఈ విధంగా ఇతను చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్.. తనదైన రీతిలో స్పందించాడు.

తమ జట్టులో సీనియర్లు లేకపోయినా.. ఇప్పుడు తాము ఎంతమాత్రం బలహీనంగా లేమన్న సంగతి మిస్బా గుర్తుంచుకోవాలని అండర్సన్ అన్నాడు. కొంతవరకూ తమ జట్టులో అనుభవలేమి ఉండవచ్చు కానీ తామేమి అప్పటికంటే బలహీనంగా  అయితే లేమన్నాడు.  పాకిస్థాన్ తో తలపడుతున్న తమ జట్టు టాలెంట్ ఉన్న ఆటగాళ్లతో నిండివుందన్న విషయం గుర్తించుకోవాలని మిస్బాకు సూచించాడు. మైకు ముందు మాటల మాట్లాడటం కాదని.. మైదానంలో దిగిన తర్వాత తమ ప్రతిభ ప్రదర్శించాలని అన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan vs england  james anderson  misbah ul haq  

Other Articles