Sri Lanka's highest stand against West Indies

Sri lanka vs west indies 1st test day 3 west indies face an uphill task

Chandimal extends purple patch, Sri Lanka roll out the old Galle welcome, Sri Lanka v West Indies at Galle, West Indies tour of Sri Lanka, Sri Lanka cricket, West Indies cricket

Jerome Taylor's 31-run cameo comes to an end as he goes for the big drive, but ends up edging one to Angelo Mathews at first slip. With just 68 runs to avoid the follow-on but only two wickets in hand

లంకతో తొలిటెస్టులో ఫాలోఆన్ అడుతున్న వెస్టిండీస్

Posted: 10/16/2015 04:23 PM IST
Sri lanka vs west indies 1st test day 3 west indies face an uphill task

శ్రీలంక పర్యటనకు వచ్చిన అధిత్య జట్టు వెస్టిండీస్‌కు తొలి టెస్టులోనే శ్రీలంక చుక్కులు చూసింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ల ధాటికి విస్తుపోయిన వెస్టిండీస్.. బౌలర్లను చూసి కూడా కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకోలేక పోయారు. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లలో బ్రావో మినహా ఎవరూ రాణించలేకపోవడం.. పరుగులను సాధించలేకపోవడంతో లంకతో జరుగుతున్న తొలి టెస్టులోనే ఫాలో అన్ అడుతున్నారు. ఎక్కడ సరైన భాగస్వామ్యం కూడా తనకు కలసిరాకపోవడంతో బ్రావో 50 పరుగులు చేసిన అవుట్ అయ్యాడు.

వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లలో టాప్, మిడిల్ ఆర్డర్ అందరూ పూర్తిగా విఫలమయ్యారు. బ్రావో, టైలర్ మినహా ఎవరూ మూడు పదుల స్కోరును కూడా దాటలేదు. చివర్లో జెరోaమి టైలర్ కొంత నిలకడగా రాణించడం చూసి ఫాలోఆన్ గండం నుంచి వెస్టిండీస్ తప్పించుకుంటుందన్న తరుణంలో తరిండు కుషాల్ అతన్ని వెనక్కు పంపించాడు.  ఆ సమయంలో సరిగ్గా వెస్టిండీస్ స్కోరు 244గా వుంది. మరో 68 పరుగులు సాధిస్తే ఫాలోఆన్ గండాన్ని దాటవచ్చు అనుకున్న నేపథ్యంలో వచ్చిన టెయిల్ ఎండర్లు కెమర్ రోచ్, షనాన్ గాబ్రియల్ లు కూడా వెనుదిరగడంతో వెస్టిండీస్ ఫాలోఆన్ అడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు సాధించింది. కరుణరత్నె (354 బంతుల్లో 186; 16 ఫోర్లు, 1 సిక్స్)కు తోడు చండిమల్ (298 బంతుల్లో 151; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో గురువారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 152.3 ఓవర్లలో 484 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్ (48) ఫర్వాలేదనిపించాడు. బిషు 4, టేలర్ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 21 ఓవర్లలో 2 వికెట్లకు 66 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (15 బ్యాటింగ్), శామ్యూల్స్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బ్రాత్‌వైట్ (19), హోప్ (23) నిరాశపర్చారు. ఈ రెండు వికెట్లు హెరాత్ తీశాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Lanka  West Indies  Galle Test  cricket  

Other Articles