టీమిండియాతో రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నిర్థేశించిన 271 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతికిలపడింది. చివర్లో పూర్తిగా చతికిలబడి 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ రోహిత్ శర్మ(65), విరాట్ కోహ్లి(77), మహేంద్ర సింగ్ ధోని(47)లు రాణించినా.. ఆఖరి ఓవర్లలో తీవ్ర ఒత్తిడికి గురికావడంతో పరాజయం తప్పలేదు. మరోసారి శిఖర్ ధవన్(13) నిరాశపరచగా, సురేష్ రైనా(0) డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 252 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కల్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా వెన్నువిరవగా, జేపీ డుమినీ, ఇమ్రాన్ తాహీర్ లకు తలో వికెట్ లభించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు డీ కాక్, డేవిడ్ మిల్లర్ లు శుభారంభం అందించారు. గత రెండు వన్డేల్లో విఫలమైన మిల్లర్ (33) ఈమ్యాచ్ లో ఫర్వాలేదనిపించినా, మరో ఓపెనర్ డీ కాక్ సెంచరీతో చెలరేగాడు. డీ కాక్ (103 నాటౌట్; 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) నమోదు చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా 38.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులతో భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు కనిపించింది.
కాగా.. చివరి 11.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది. స్వల పరుగుల వ్యవధిలో డీ కాక్, ఏబీ డివిలియర్స్(4), జేపీ డుమిని(14)లు పెవిలియన్ కు పంపి దక్షిణాఫ్రికాను టీమిండియా కట్టడి చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డు ప్లెసిస్(60; 63 బంతుల్లో 6 ఫోర్లు) , బెహర్దియన్ (33 నాటౌట్) ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో మోహిత్ శర్మకు రెండు వికెట్లు లభించగా, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ లకు తలో వికెట్ దక్కింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more