భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్ మునుపటి మాదిరిగానే కోనసాగాలంటే భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలు చర్చించాల్సిన అవసరం ఎంతైనా వుందని మాజీ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. రెండు దేశాల మధ్య డిసెంబర్ - జనవరిలో జరగాల్సిన సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ నుంచి స్పందన కోసం పిసిబి ఎదురు చూస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి కోరామని, పది రోజుల్లోగా సిరీస్ పైన జవాబిస్తామని బీసీసీఐ చెప్పింది. దీంతో సిరీస్ జరగడం ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య అపనమ్మకాన్ని తొలగించాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇస్లామాబాద్, ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగి అవి ఫలప్రదంగా ముగిస్తేనే ఈ సిరీస్ కొనసాగతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఏ సమస్యను పరిష్కరించుకోవాలన్నా ముందు సంప్రదింపులు ముఖ్యమని చెప్పాడు. మాట్లాడుకోనంత వరకు ఏ సమస్యకూ పరిష్కారం దొరకదన్నాడు. ఏ ఆటకూ ప్రభుత్వ అభిప్రాయాన్ని మార్చే శక్తి లేదని, అయితే రెండు దేశాలు పోటీ పడ్డప్పుడు, ఆయా దేశాల అభిమానులు వచ్చి మ్యాచ్‌లు చూసి, కలుపుగోలుగా ఉండి పరిస్థితులను అర్థం చేసుకుంటే.. ఆ పరిణామాలు ప్రభుత్వానికి ఓ సంకేతాన్నిస్తాయన్నాడు. నేను రాజకీయ నాయకుణ్ని కాదని, ఒక మాజీ ఆటగాడిగా మాట్లాడుతున్నానని చెప్పాడు. ఏ సమస్య అయినా మాట్లాడుకుంటేనే పరిష్కారమవుతుందన్నాడు. ఐతే మాజీ ఆటగాళ్లు ఏమంటున్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదని, బాగా ఆలోచించిన తర్వాతే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని గవాస్కర్ అన్నాడు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more