India vs SA third test - bowlers dominated nagpur test on day one

India capitulate for 215 before hitting back on day 1

Nagpur test, iindia vs south africa, ind vs sa, india south africa, ind vs sa 3rd test, india cricket, cricket india, south africa cricket, south africa vs india, sa vs ind, cricket score, cricket news, cricket, Murali Vijay, M Morkel, S Harmer

Indian batsmen capitulated meekly against both pace and spin to be shot out for 215, before hitting back at South Africa with two early scalps on day one of the third test.

తొలిరోజున బౌలర్లదే హావా.. స్వల్పస్కోరుకే టీమిండియా అలౌట్

Posted: 11/25/2015 06:43 PM IST
India capitulate for 215 before hitting back on day 1

నాగ్ పూర్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు సఫారీలు అధిపత్యం కనబర్చారు. సఫారీ బౌలర్ల తమ సత్తాను చాటి కోహ్లీ నేనను స్వల్ప స్కోరుకే అలౌట్ చేశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ను దక్షిణాఫ్రికా బౌలర్లు 215 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సరికి కేవలం 11 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఇరు జట్లలో బౌలర్లు మొత్తం 12 వికెట్లు తీశారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌటయినా.. దక్షిణాఫ్రికా వికెట్లు రెండు పడగొట్టి మ్యాచ్ పై పట్టు చేజారకుండా కాపాడుకుంది. మ్యాచ్ రెండో రోజు భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే సౌతాఫ్రికాకు కష్టాలు తప్పకపోవచ్చు.

టీమిండియా 50 పరుగుల వరకు వికెట్లు కోల్పోకుండా నిలకడగా ఆడుతున్నట్టు కనిపించింది. కానీ ధావన్ వికెట్ కోల్పోయిన అనంతరం వరుసగా వికెట్లను కోల్పోతూ 215 పరుగుకే ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగింపుకు లోపే భారత్ అలౌట్ అయ్యింది. ఈ టెస్టు సిరీస్ ను గెలిచి తనకు కెప్టెన్సీ పగ్గాలను ఇచ్చిన బిసిసిఐకి బహుమతిగా ఇవ్వాలనుకున్న కోహ్లీ.. సహా ఆయన సేన మొత్తం సఫారీ బౌలర్లకు మోకరిల్లింది. మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆత్యందం నిలదొక్కకోలేక తడబడింది. సఫారీ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే వికెట్లు కోల్పోయిన టీమిండియా 215 పరుగులకే అలౌట్ అయ్యింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 పరుగుల వరకు వికెట్లు కోల్పోకుండా ధాటిగా ఆడుతున్నట్టు కనిపించింది. కానీ ధావన్ వికెట్ కోల్పోయిన అనంతరం వరుసగా వికెట్లను కోల్పోతూ 215 పరుగుకే ఆలౌటైంది. మురళీ విజయ్(40), జడేజా(34), సాహా(32) పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున టాప్ స్కోరర్లు గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4, మోర్కెల్ 3 వికెట్లు పడగొట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : team india  nagpur cricket test  south africa  

Other Articles