Lalit Modi promises transparency in new tenure as RCA president

Rejuvenated lalit modi thanks sharad pawar for support

Amin Pathan, Amrit Mathur, BCCI, ED, Lalit Modi, rajasthan cricket association, RCA president, Rajasthan, Rajasthan High Court, RCA, Sharad Pawar

Former IPL chairman Lalit Modi not only makes a dramatic return as RCA president, but gets strong support from former BCCI and ICC president Sharad Pawar.

రాజస్థాన్ పీఠంపై లలిత్ మోడీ.. పవార్ కు కృతజ్ఞతలు

Posted: 12/17/2015 06:39 PM IST
Rejuvenated lalit modi thanks sharad pawar for support

వివాదాస్పద ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి.. మళ్లీ రాజస్తాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సీఏ) పగ్గాలు చేపట్టనున్నారు. ఈ మేరకు అతనిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అమిన్ పఠాన్ అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. ఈ విషయంపై జస్టిస్ జ్ఞాన్ సుధ మిశ్రా.. ఆర్‌సీఏ అధికారులతో కలిసి చర్చించారు. ‘క్రికెట్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 15 జిల్లా సంఘాలు, ముగ్గురు ఆఫీస్ బేరర్లు మోడిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక నిబంధనల ప్రకారం తీర్మానంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు.
 
తాజా పరిణామాల నేపథ్యంలో నిబంధనల ప్రకారం ఎన్నికైన మోడి తిరిగి బాధ్యతలు స్వీకరించొచ్చు. ఈ సమావేశానికి అన్ని సంఘాలు, బేరర్లు హాజరయ్యారు. పఠాన్ దరఖాస్తును వెనక్కి తీసుకోవడానికి అందరూ మద్దతిచ్చారు’ అని మిశ్రా పేర్కొన్నారు. కాగా తను మరోమారు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడుగా ఎన్నిక కాబతోుతన్న సందర్బంగా ఆయన బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, ఎన్సీపి అధినేత శరద్ పవార్ కు  కృతజ్ఞతలు తెలిపాడు. తనకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు కూడా పేర్కోన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalith modi  rajasthan cricket association  RCA president  

Other Articles