Virat Kohli, Mithali Raj named BCCI's cricketers of the year

Virat kohli named bcci cricketer of the year

BCCI. cricketer of the year. Virat Kohli. Mithali Raj. Polly Umrigar award, Syed Kirmani, virat kohli award, virat kohli bcci award, virat kohli india, india virat kohli, kohli india cricket, indian cricket team, team india, cricket news

Indian Test captain Virat Kohli, named the winner of the Polly Umrigar award for BCCI’s international cricketer of the year, while Mithali Raj was picked for the top women’s award.

విరాట్, మిథాలీలకు క్రికెటర్ అఫ్ ది ఇయర్ అవార్డులు..

Posted: 12/31/2015 06:28 PM IST
Virat kohli named bcci cricketer of the year

భారత డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి ఈ ఏడాది చాలా కలిసోచ్చింది. ఓ వైపు ఐసీసీ క్రికెట్ వన్డే టార్నోమెంట్లో విమర్శల పాలై విరాట్ తో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మకు కూడా నెట్ జనులు తీవ్రంగా విమర్శించిన తరుణంలో.. వాటన్నింటినీ తోసిరాజి భారత్ టెస్టు క్రికెట్ కెప్టెన్ పగ్గాలను అందుకున్న విరాట్ కోహ్లీకి మరో కలికితురాయి చేరింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు కోహ్లి ఎంపికయ్యాడు.

ఈ ఏడాది విశేషంగా రాణించిన కోహ్లికి పురుషుల కేటగిరీలో ఈ అవార్డు దక్కగా.. మహిళా కేటగిరీలో ఇచ్చే బెస్ట్ వుమెన్స్ అవార్డును మిథాలీ రాజ్ గెలుచుకుంది. 2014-15 గాను మెన్స్, వుమెన్స్ క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా బీసీసీఐ తమ వార్షిక అవార్డులను ప్రకటించింది.  ఈ అవార్డులను జనవరి 5 వ తేదీన ముంబైలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. ఈ సంవత్సరం కోహ్లి అటు టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ  భారత తరపున ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. 15 టెస్టుల్లో 42.67 సగటుతో 640 పరుగులు చేయగా, 20 వన్డేల్లో 36.65 సగటుతో 623 పరుగులు చేశాడు.

దీంతో కోహ్లీ రెండోసారి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు. అంతకుముందు 2011-12 సంవత్సరానికి గాను తొలిసారి విరాట్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.  ఈ ఏడాది కోహ్లీ నేతృత్వంలో టీమిండియా మరపురాని విజయాలను సాధించింది. ఇదిలా ఉండగా బెస్ట్ వుమెన్స్ (ఎంఎ చిదంబరం ట్రోఫీ) అవార్డును గెలుచుకున్న మిథాలీ రాజ్.. మొత్తంగా 158 వన్డేలు ఆడి  5,029 పరుగులు చేసింది.  దీంతో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా మిథాలీ అరుదైన ఘనతను సాధించగా.. ఓవరాల్ గా రెండో మహిళా క్రికెటర్ గా గుర్తింపు పొందింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  BCCI  cricketer of the year  

Other Articles