Syed Mushtaq Ali trophy: Hat-tricks for Chawla, Pandey; Yuvraj fails

Yuvraj out for 2 hat tricks for pandey chawla

syed mushtaq ali trophy, syed mushtaq t20 tournament, syed mushtaq t20 tournament kochi, yuvraj singh, yuvraj singh t20 tournament kochi, piyush chawla, ishwar pandey, mohammed shami, sports latest news

Yuvraj Singh was dismissed for two runs by a slower delivery from Rajat Bhatia, caught by Rajesh Bisnoi.

మరో మారు యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన

Posted: 01/02/2016 08:20 PM IST
Yuvraj out for 2 hat tricks for pandey chawla

విజయ్ హజారే వన్డే ట్రోఫీలో చెలరేగిన యువరాజ్ సింగ్.. ఇవాల ఆరంభమైన ముస్తాక్ అలీ ట్వంటీ 20 టోర్నీలో వైఫల్యం చెందాడు. గ్రూప్-బిలో భాగంగా రాజస్థాన్ తో శనివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ యువరాజ్ సింగ్ (2) ఘోరంగా విఫలం చెందాడు. ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొన్న యువీ అనవసరపు షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత మరో పరుగు వ్యవధిలో సిధానా(0) ను నాల్గో వికెట్ రూపంలో అవుటయ్యాడు.
 
పంజాబ్ 52 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి  కష్టాల్లో ఉన్న తరుణంలో మన్ దీప్ సింగ్  తో గురిందర్ సింగ్ జత కలిశాడు. వీరిద్దరూ బాధ్యాతయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. మన్ దీప్(76నాటౌట్), గురిందర్(29 నాటౌట్) కుదురుగా ఆడటంతో  పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. అనంతరం సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

రాజస్థాన్ ఓపెనర్లు మనీందర్ సింగ్(8),లాంబా(20) ఆదిలోనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచారు.అనంతరం పునీత్ యాదవ్(0), మినారియా(3) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ కు చేరడంతో రాజస్థాన్ 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో రాజేష్ బిష్నోయ్(58) మరమ్మత్తులు చేపట్టాడు. అతనికి తోడు యాగ్నిక్(23 నాటౌట్) ఫర్వాలేదనిపించడంతో రాజస్థాన్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh  syed mushtaq ali trophy  Indian Domestic Season  India cricket  

Other Articles