MS Dhoni becomes first international captain to hit 200 sixes

Ms dhoni reached another milestone

MS Dhoni, dhoni 200 sixes, Dhoni sixes record, 200 international sixes, asia cup 2016, cricket, cricket news, India, MS Dhoni

Dhoni became the first player to complete 200 sixes as captain in 315 innings in international cricket, the next best being 171 in 376 innings by Ricky Ponting.

మరో అరుదైన ఘనతను అందుకున్న మిస్టర్ కూల్

Posted: 03/02/2016 05:51 PM IST
Ms dhoni reached another milestone

టీమిండియా లిమిటెడ్ ఓవర్ల కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయి అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200 సిక్సర్లు బాదిన కెప్టెన్ గా టీమిండియా కెప్టెన్ నిలిచాడు. ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ లో ఏ జట్టు సారధి ఈ అరుదైన ఘనతను సాధించలేదు. అంతేకాదు మిస్టర్ కూల్ దరిదాపులో కూడా ఏ కెప్టెన్ లేడన్న సంకేతాలు వస్తున్నాయి. ధోని ఈ మైలురాయిని చేరుకోవడంపై అయన ఎలా స్పందిచారన్నది ఇంకా తెలియలేదు.

ఆసియాకప్ టి20 టోర్నీలో భాగంగా శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్ లో ధోని ఈ రికార్డు సాధించాడు. హార్ధిక పాండ్యా అవుటైన తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగిన ఈ 'విన్నింగ్ షాట్ల స్పషలిస్ట్' తన శైలిలో మిలింద సిరివదర్దన బౌలింగ్ లో సిక్సర్ బాది 200 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో టాప్ లో నిలిచాడు. రికీ పాంటింగ్(171), బ్రెండన్ మెక్ కల్లమ్(170), క్రిస్ గేల్(134), సౌరవ్ గంగూలీ(132) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరిలో గేల్ తప్ప మిగతా ముగ్గురు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగారు. దీంతో ధోని రాకార్డును ఇప్పడప్పుడే అధిగమించే అవకాశాలు లేనట్లే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asia cup 2016  cricket  cricket news  India  MS Dhoni  

Other Articles