warm-up match, Rohit Sharma hits 98, Jasprit Bumrah keeps form going

India beat west indies with 45 runs in world t20 warm up

world t20, world t20 updates, India, west indies, practice match, world t20 news, world t20 scores, ms dhoni, ms dhoni captain, ms dhoni india, jasprit bumrah, mohammed shami, hardik pandya, yuvvraj, kohli, rohit sharma, shami bowling, sports news, sports, cricket news, cricket

Rohit Sharma hit 98* before four bowlers picked two wickets each as India beat West Indies by 45 runs in warm-up.

ప్రాక్టీసు మ్యాచ్: విండీస్ పై టీమిండియా విజయం

Posted: 03/11/2016 04:30 PM IST
India beat west indies with 45 runs in world t20 warm up

ఆసియా కప్ లో ఓటమి ఎరుగని జట్టుగా వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న టీమిండియా ఇవాళ టీ20 ప్రపంచ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ లో వెస్టీండీస్ ను కూడా ఖంగుతినిపించింది.  టి20 ప్రపంచకప్‌లో భారత్ తమ ‘సాధన’ను ఘనంగా ప్రారంభించింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగి తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ 45 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. టాస్ లేకుండా పరస్పర అవగాహనతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కొద్దిలో రోహిత్ శర్మ (57 బంతుల్లో 98 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు)  సెంచరీ మిస్ అయింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు అతను పరుగు తీయలేకపోయాడు.

యువరాజ్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 46 బంతుల్లోనే 89 పరుగులు జోడించడం విశేషం. విండీస్ బౌలర్లలో టేలర్, బెన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది. క్రిస్ గేల్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్)ను బుమ్రా తాను వేసిన మూడో బంతికే బౌల్డ్ చేసిన తర్వాత విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. షమీ మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేయగా, రహానే 4 క్యాచ్‌లు అందుకున్నాడు. భారత బౌలర్లలో నేగి, పాండ్యా, జడేజా, షమీ తలా 2 వికెట్లు పడగొట్టారు. భారత్ తమ తర్వాతి వార్మప్ మ్యాచ్‌ను శనివారం దక్షిణాఫ్రికాతో ముంబైలో ఆడుతుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup  India  west indies  practice match  mohammed shami  ms dhoni  

Other Articles