టీ 20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో టీమిండియా ఒత్తిడికి గురవుతుందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. బంగ్లాదేశ్ పై గెలిచి పాకిస్థాన్ విజయగర్వంతో వుందని, అయితే భారత్ మాత్రం న్యూజీలాండ్ చేతిలో పరాజయం పాలై ఓత్తిడితో 19న జరిగే దాయాధుల పోరులో తలపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. దీంతో విశ్లేషకుల వాదనలకు బలం చేకూరుతుంది.
ఈడెన్ గార్డెన్ లో జరగనున్న దాయాది జట్ల మధ్య జరగనున్న పోరులో పాకిస్థాన్ గా బరిలోకి దిగబోతోందని అన్నాడు. టీమిండియాపై ఒత్తిడిలో ఉందని తెలిపాడు. టోర్ని ప్రారంభానికి ముందు ధోని సేనను అందరూ ఫేవరేట్ గా భావించారని, టైటిల్ కూడా గెలుస్తుందని ఊహించారని అన్నారు. ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన తర్వాత టీమిండియాపై ఒత్తిడి పెరిగిందన్నాడు. బంగ్లాదేశ్ పై విజయంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో ఉందని అన్నాడు.
అంతేకాదు, భారత్ తో జరగబోయే మ్యాచ్ లో ఆఫ్రిది సేన ఫేవరేట్స్ గా బరిలో దిగే అవకాశముందని విశ్లేషించాడు. ఎప్పటిలాగానే భారత్ బ్యాటింగ్ కు, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య పోటీ ఉంటుందని వివరించాడు. ఆసియా కప్ లో ఇబ్బంది పెట్టిన పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ ను ఎలా ఎదుర్కొవాలే ఈపాటికి భారత బ్యాట్స్ మెన్ నేర్చుకునే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై ఎప్పుడు ఓడిపోని రికార్డును టీమిండియా కొనసాగిస్తుందో, లేదో చూడాలంటే ఈ నెల 19 వరకు ఆగాలి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more