Despite India's absence, Sourav Gagnguly promises full house for World T20 final

Nobody is perfect ms dhoni is a great captain says sourav ganguly

Icc World T20. Virat Kohli, Australia, Yuvraj Singh, manish pandey, semi finals, west indies, saurav ganguly, Mahendra Singh Dhoni, ind vs aus, india vs australia, ind vs aus, australia vs india, aus vs ind, virat kohli, kohli, sunil gavaskar, gavaskar, india virat kohli, kohli, wt20, icc world t20, cricket

Former India captain and Cricket Association of Bengal (CAB) president Sourav Ganguly said, "Not a ticket left. The stadium will be packed to capacity."

ధోనిపై గంగూలీ ప్రశంసలు.. వ్యూహాలు కరెక్టేనని కితాబు

Posted: 04/03/2016 04:02 PM IST
Nobody is perfect ms dhoni is a great captain says sourav ganguly

టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టామిండియా పరాజయం పాలైనా, భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ అఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ పోరును ముందే వారిని తక్కువగా అంచనా వేయవద్దని చెప్పిన గంగూలీ, ఈ మ్యాచ్ లో ధోని అమలు చేసిన వ్యూహాలు అధికంగా సరైన దిశలోనే సాగాయని అయితే విండీస్ అసాదరణ ఆటతీరు టీమిండియా ఓటమికి కారణమైందని చెప్పుకోచ్చాడు.

భారత క్రికెట్ కెప్టెన్లలో ధోనినే మేటి. కెప్టెన్గా ధోని విజయవంతమైనట్లు ఇప్పటి వరకూ మరోక సారధి ఎవరూ సక్సెస్ కాలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ధోని ఒక మంచి కెప్టెన్ అని కితాబిచ్చాడు. తామంతా భారత్ వరల్డ్ కప్ గెలవాలని కోరుకున్నామని అయితే. భారత్ కంటే అత్యుత్తమ ఆట తీరు కనబరిచిన విండీస్ ఫైనల్ కు చేరిందని పేర్కోన్నారు. ఆ మ్యాచ్ లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా వెస్టిండీస్ ఎదుట 193 పరుగుల భారీ లక్ష్యాన్ని తక్కువ స్కోరు కాదని ఆయన పేర్కోన్నాడు.

అయితే గేల్ తొలి ఓవర్లలోనే అవుట్ కావడంతో టీమిండియా తాము గెలిచామన్న భావనలోకి వెళ్లిందని, అదే జట్టు విజయాలను దెబ్బతీసిందని భావిస్తున్నానన్నాడు, ఇక విండీస్ జట్టులో గేల్ ఔటైన కారణంగా తామే నిలదొక్కుకుని జట్టను విజయపథంలో నడిపంచాలన్న తరువాతి బ్యాట్సమెన్ల అకాంక్ష, వారి అసాధారణ ఆటతోనే సాధ్యమైందిని గంగూలీ పేర్కొన్నాడు. ఇటీవల కోల్ కతా నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలిపోయిన విషాద సంఘటనకు సంబంధించి వరల్డ్ 20 ఫైనల్కు ముందు ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలని క్యాబ్ నిర్ణయించినట్లు ప్యానెల్ సమావేశంలో గంగూలీ స్పష్టం చేశాడు. కాగా ఫైనల్ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డడెన్ లో ఒక్క టిక్కట్ కూడా మిగిలిపోలేదని, స్టేడియం పూర్తాగా ఫ్యాక్ అయ్యిందని చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Icc world cup T20-2016  saurav ganguly  ms dhoni  india  semi finals  west indies  

Other Articles