Sir Viv Richards backs West Indies captain after World T20 outburst

Viv richards supports darren sammy in west indies dispute

Caribbean, Darren Sammy, Emmanuel Nanthan, ICC WT20 2016, Sir Viv Richards, T20 World Cup, West Indies, West Indies vs WICB, WICB

Batting great Viv Richards has come out in support of Darren Sammy after West Indies Twenty20 skipper criticised the Cricket Board (WICB) for its lack of support during their triumphant campaign at the World T20 in India.

స్యామికి మద్దతుగా నిలిచిన సర్ వివి రిచర్డ్స్

Posted: 04/07/2016 06:21 PM IST
Viv richards supports darren sammy in west indies dispute

వరల్డ్ ట్వంటీ 20లో విజేతగా నిలిచినా, తమ క్రికెట్ బోర్డు నుంచి సరైన సహకారం అందలేదన్న వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ వ్యాఖ్యలకు ఆ దేశ మాజీ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ మద్దతుగా నిలిచాడు. ' స్యామీ అబద్దాలకోరు అని నేను అనుకోవడం లేదు. స్యామీ నిజాయితీగానే మాట్లాడాడు. అతను చేసిన వ్యాఖ్యలు మనసు నుంచి ఎటువంటి కలష్మం లేకుండా వచ్చినవే. ఇక్కడ ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో విండీస్ కప్ గెలవడం నిజంగా అభినందనీయం.

ఇప్పుడు విండీస్ ఆటగాళ్లకు స్యామీ ఒక ప్రతినిధిగా ఉన్నాడు. రాబోవు రోజుల్లో బోర్డు నుంచి ఎటువంటి సంకేతాలొచ్చినా ఇలానే విజయాలతోనే ముందుకు సాగండి' అని రిచర్డ్స్ సూచించాడు. వరల్డ్ టీ 20కప్ను విండీస్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ఇంటర్యూలో  ఆ దేశ క్రికెట్ బోర్డు తీరును స్యామీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని స్యామీ పేర్కొన్నాడు. తమ పట్ల విండీస్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Darren Sammy  west indies  world twenty 20  Viv Richards  

Other Articles