Bengaluru to host final; Pune, Mumbai given home options

Vizag kanpur likely to be new ipl venues bengaluru to host finals

ipl games in maharashtra, indian premier league, rajeev shukla, bcci, cricket, cricket news, latest sports news, drought in maharashtra, mumbai indians, rising pune supergiants

IPL chairman Rajeev Shukla says Mumbai Indians will reply by April 17 while Pune prefers Vizag.

వైజాగ్, కన్పూర్ క్రికెట్ అభిమానులకు కలసివచ్చిన అదృష్టం..

Posted: 04/15/2016 08:57 PM IST
Vizag kanpur likely to be new ipl venues bengaluru to host finals

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా మహారాష్ట్ర నుంచి తరలించే అన్ని మ్యాచ్లలో కొన్నింటినీ విశాఖలో నిర్వహించనున్నారు. ఐపీఎల్ ఫైనల్ కోసం ముంబైకి బదులు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలని బిసిసిఐ, ఐపీఎల్ నిర్వాహక కమిటీ నిర్ణయించింది. మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్ లను ఈ నెల 30 లోపు తరలించాలని బొంబే హైకోర్టు అదేశాలు జారి చేయడంతో అక్కడి నుంచి తరలిస్తున్నారు.

కాగా మహారాష్ట్రలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఆడాల్సిన ఉన్న మ్యాచ్లు విశాఖపట్టణంలో జరుగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం లీగ్ ఫ్రాంచైజీలతో లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా సమావేశమైన అనంతరం నిర్ణయం తీసుకున్నారు.  విశాఖను పుణె హోం గ్రౌండ్ గా ఎంచుకోవడంతో కొంత వరకూ స్పష్టత రాగా, ముంబై ఇండియన్స్ జట్టు తమ నిర్ణయాన్ని చెప్పడానికి మరికొంత సమయాన్నికోరింది. ఏప్రిల్ 17వ తేదీ తరువాత తుది నిర్ణయం చెబుతామనడంతో ముంబై ఇండియన్స్  హోం గ్రౌండ్ ఇంకా ఖరారు కాలేదు.  

అయితే తొలి క్వార్టర్ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ను బెంగళూరుకు మార్చే అవకాశం ఉండగా, రెండో క్వార్టర్ ఫైనల్, ఎలిమినేటర్ మ్యాచ్ను కోల్కతా లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  దీనిపై త్వరలో బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. మహారాష్ట్రలో నీటి సమస్య కారణంగా  ఆ రాష్ట్రంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లను తరలించాలంటూ బాంబే హైకోర్టు  తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.  దీంతో ఈనెల 30 అనంతరం ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌లకు చెందిన 13 మ్యాచ్‌లను ఇతర వేదికలకు మార్చాల్సిన అవసరం ఏర్పడింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai Indians  Rising Pune Supergiants  IPL 9  Cricket  latest IPL 9 news  

Other Articles