No loyalty to team, it's loyalty to money now, says Steve Waugh

Steve waugh feels that players are loyal to money in the t20 era

steve waugh, steve waugh australia, steve waugh australia captain, steve waugh batting, sports news, sports, cricket news, cricket

Steve Waugh feels that the cash-rich T20 leagues have made it difficult to create a balance between all three formats for the teams.

ఫోట్టిఫార్మెట్ క్రికెట్ అగమనంతో.. డబ్బుకే ఆటగాళ్ల ప్రాముఖ్యత

Posted: 04/19/2016 08:15 PM IST
Steve waugh feels that players are loyal to money in the t20 era

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా తన అభిమాన ఆట క్రీడాకారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటితరం క్రికెటర్లు డబ్బుకే అధికి ప్రాముఖ్యతను ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు, క్రికెట్ లోకి ఫోట్టి ఫార్మెట్ ఆగమనంతో క్రికెటర్లు దృక్పథంలో మార్పు వచ్చిందని ఆయన ముక్కుసూటి వ్యాఖ్యలు చేశారు. ఇక టి20 క్రికెట్ లీగ్‌లను పలు దేశాలు నిర్వహించనుండటంతో వాటిలో ఆడటం ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆశ క్రికెటర్లలో కలుగుతుందని అన్నారు.

ఫోట్టిఫార్మెట్ లీగ్ ల రాకతో ఆటగాళ్ల దృక్పథంలో గణనీయ మార్పు కనిపిస్తోందని తెలిపారు. ఇందులో ఎక్కువ డబ్బు కనిపిస్తుండడంతో జాతీయ జట్లకు ఆడడం కన్నా లీగ్‌ల్లో ఆడేందుకే ఆటగాళ్లు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా ఆయా జట్లు తమ మూడు ఫార్మాట్లలో సమతూకాన్ని సాధించలేకపోతున్నాయని అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్ని రోజుల తరువాత టెస్టు క్రికెట్ మరుగున పడిపోతుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
 
అయితే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు ఈ సమస్య పెద్దగా లేదని చెప్పుకొచ్చిన ఆయన ఇతర దేశాల క్రికెటర్లలో ఈ మార్పు ప్రస్పుటిస్తుందని అన్నారు. కాగా స్టీవ్ వా అభిప్రాయాలతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ ఏకీభవించారు. ఆయన కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. టి20 క్రికెట్‌ను అటకెక్కించాల్సిన అవసరం ఉందని అన్నారు. టెస్టు క్రికెట్టే నంబర్‌వన్ అని స్పష్టం చేశారు. తమ దేశంలో టెస్టులకు కూడా స్టేడియాలు నిండుతాయని గుర్తుచేశారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : steve waugh  cricketets  australia  England  ian botham  

Other Articles