ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ తీరు తనకు బాధను, నిరాశను కలిగిస్తోందని అవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడు భారత జట్టు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్న తీరును తప్పుబట్టారు. క్రికెట్ అంటే కేవలం 20 ఓవర్ల గేమ్ మాత్రమే కాదని, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు, క్రికెటర్లు 20 ఓవర్ల ఫార్మాట్ కు బానిసలుగా మారారని ఆయన తీవ్ర అందోళనను వ్యక్తం చేశారు.
క్రికెట్ శ్రేయస్సు దృష్ట్యా ఐపీఎల్ ను తొలగిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఇండియా - ఇంగ్లండ్ తలపడుతున్నాయంటే అభిమానులకు ఎంతో ఉద్వేగంగా అనిపించేదని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదని పూర్తిగా మారిపోయిందని ఇయాన్ బోథమ్ చెప్పారు. గడిచిన రెండు టెస్ట్ సిరీస్‌లలో ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు 0-4, 1-3 తేడాతో ఓడిపోయింది. 2012లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కూడా టీమిండియా ఓటమి చవిచూసిందని చెప్పారు. భారత్‌లో టెస్ట్ క్రికెట్ ఏమైపోతోందని, అసలు ఈ జట్టుకు ఏమైందని ఆయన ప్రశ్నించారు.
టెస్టు క్రికెట్ విషయంలో భారత్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించిన భోథమ్ పనిలో పనిగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ లపై కూడా పెదవి విరిచాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగులలో భారత్ మూడో ర్యాంకులో ఉన్నా, ప్రస్తుత పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు ఈ ర్యాంకులు ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లేదని.. నిజానికి ఇప్పుడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మంచి క్రికెట్ ఆడుతున్నా అవి ఎందుకు ముందు లేవని బోథమ్ ప్రశ్నించారు.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more