బంగ్లాదేశ్ స్పీడ్ స్టార్ క్రికెట్ మీద మోజు, అమితాసక్తితో అప్పట్లో ఒక అంశాన్ని పక్కన బెట్టాడు, దీనికి ఆయన కుటుంబ పేదరికం కూడా ఒక కారణం కావచ్చు. అయితే బాల్యంలో దేనైతే ఆయన పక్కనబెట్టాడో.. ఇప్పుడదే ఆనను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఎంతలా అంటూ నిత్యం చిరునవ్వులు చిందిస్తూ వుండే రహమాన్.. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ డ్రెసింగ్ రూమ్ లో మాత్రం ఎవరితోనూ కలవలేక పోతున్నాడు. అంతేకాదు కనీసం తన ఉత్తమ ప్రదర్శనకు అందించే మ్యాచ్ అప్ ది మ్యాచ్ సందర్భాంగా కూడా ఆయన నిశ్చేష్టుడిలా వుండిపోవాల్సి వస్తుంది, ఇంతకీ ఆయను ఇబ్బంది పెడుతుందన్నది ఏమిటీ..?
ముస్తాఫిజుర్ రహమాన్ క్రికెట్ మోజులోపడి బాల్యంలో చదువును నిర్లక్ష్యం చేశాడు. అదే ఇప్పుడతన్ని గొప్ప చిక్కుల్లో పడేసింది. ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని బౌలర్ గా మంచిపేరు తెచ్చుకున్నా ఆయనకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫన ఆడుతోన్న ముస్తాఫిజుర్ ఎవరితో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఇన్నాళ్లంటే బంగ్లాదేశీ జట్టే కాబట్టి బెంగాలీలో మాట్లాడేవాడు. ఇప్పుడు.. ఐపీఎల్ మ్యాచులలో అడుతున్న అతగాడు మిగతా అటగాళ్ల మాటలను కూడా అర్థం చేసుకోలేక తెగ ఇబ్బందులు పడుతున్నాడు.
పలు దేశాలకు చెందిన క్రికెటర్లతో పాటు దేశీయ క్రిడాకారుల కూర్పుతో ఏర్పడ్డ జట్టలో జట్టు సభ్యలందరికీ అర్థం కావాలంటే తప్పనిసరిగి యూనివర్సల్ బాషగా పేరొందిన అంగ్లాన్ని అశ్రయించక తప్పదు. చిన్నప్పటి నుంచి క్రికెట్ లో పడిపోయి చదువును అలక్ష్యంచేసిన అతనికి అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ పదిముక్కలైనా రాదు. దీంతో సహచరులతో ఐడియాలు పంచుకోవాలన్నా, ప్రెజెంటేషన్ సెర్మనీల్లో మాట్లాడాలన్నా వెనకడుగు వేస్తున్నాడు. ఇదే విషయాన్ని డేవిడ్ వార్నర్ చెప్పాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్ ఇరగదీస్థాడు కానీ బ్యాటింగ్ చేయడంతో పాటు.. ఆంగ్ల బాషలో మాట్లాడటమే అతని సమస్య అని చెప్పుకొచ్చాడు.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more