IPL 2016: After three straight wins, high-flying Sunrisers Hyderabad crash land in the rain

Supergiants thrash sunrisers hyderabad

Rising Pune Supergiants,Sunrisers Hyderabad, shikar dhawan, pune super gaints, ashok dinda, Steven Smith,Bhuvneshwar Kumar,Mustafizur Rahman,David Warner,MS Dhoni,IPL 9,Cricket latest IPL 9 news

Sunrisers will face some stern challenges in their quest to qualify for the second phase of the IPL. Only three of their remaining eight games are at home,

ఎట్టకేలకు ధోని సేనను వరించిన విజయం

Posted: 04/27/2016 05:53 PM IST
Supergiants thrash sunrisers hyderabad

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వరుస పరాజయాలు కలవరపెట్టిన మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని పుణే సూపర్ జెయింట్స్ ను ఎట్టకేలకు విజయం వరించింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన పూణే.. సన్ రజర్స్ హైదరాబాద్ పై  గెలుపుతో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్ వైఫల్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

శిఖర్ ధావన్ (53 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేసే సమయానికి పుణే 11 ఓవర్లలో 3 వికెట్లకు 94 పరుగులు చేసింది.  స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు), డు ప్లెసిస్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 50 బంతుల్లోనే 80 పరుగులు జత చేశారు. పుణే బౌలర్ అశోక్ దిండాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
 
గత మూడు మ్యాచ్‌లలో ఛేదనలో అద్భుతాలు చేసిన సన్‌రైజర్స్ ఈసారి తొలుత బ్యాటింగ్ చేస్తూ పూర్తిగా తడబడింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ వార్నర్ విఫలమైతే  ఒక్కసారిగా ఎలా కుప్పకూలుతుందో ఈ మ్యాచ్ చూపించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వార్నర్ (0)ను అవుట్ చేసి అశోక్ దిండా దెబ్బ తీశాడు. ఆ తర్వాత క్యూ కట్టినట్లు ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఒకరి వెనక మరొకరు వెనుదిరిగారు. మూడో స్థానంలో వచ్చిన తారే (14 బంతుల్లో 8; 1 ఫోర్) ప్రభావం చూపించలేకపోగా, మోర్గాన్ (0), హుడా (1), హెన్రిక్స్ (1) విఫలమయ్యారు.

అయితే మరోవైపు రైజర్స్ జట్టు తరఫున అదృష్టవశాత్తూ ధావన్ నిలబడ్డాడు. ఆరంభంలో పరిస్థితిని బట్టి జాగ్రత్తగా ఆడిన ధావన్, ఆ తర్వాత మరింత బాధ్యతతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కొంతవరకు నమన్ ఓజా (21 బంతుల్లో 18; 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 51 బంతుల్లో 47 పరుగులు జోడించారు. 41 పరుగుల వద్ద రహానే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ధావన్, 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. చివర్లో భువనేశ్వర్ (8 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో సన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
 
పుణే ఇన్నింగ్స్‌కు కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి రహానే (0) అవుటయ్యాడు. అయితే స్మిత్, డు ప్లెసిస్ కలిసి జెయింట్స్‌ను నడిపించారు. ముస్తఫిజుర్ వేసిన రెండు ఓవర్లలో కలిపి స్మిత్ నాలుగు ఫోర్లు బాది జోరు ప్రదర్శించడంతో  పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 46 పరుగులకు చేరింది. బిపుల్ వేసిన ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో పుణే 17 పరుగులు రాబట్టింది. ఇదే జోరులో భాగస్వామ్యం 80 పరుగులకు చేరిన అనంతరం హెన్రిక్స్, డుప్లెసిస్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే స్మిత్ చక్కటి ఆటతో పుణేను విజయతీరాలకు చేర్చాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci  cricket  IPL 2016  ipl 9  MS Dhoni  David warner  Pune  Hyderabad  

Other Articles