Chris Gayle back in India, dances up a storm with Virat Kohli

Rohit sharma celebrates 29th birthday with wife ritika

rohit sharma, rohit india, rohit birthday, rohit sharma gallery, rohit sharma birthday gallery, mumbai indians, ritika sajdeh, happy birthday, sports news, sports gallery, cricket news, cricket

Rohit Sharma turned 29 on Saturday and he celebrated the special day with his wife and teammates from Mumbai Indians.

భార్యతో కలసి భర్తడే సెలబ్రేట్ చేసుకున్నాడు

Posted: 04/30/2016 06:24 PM IST
Rohit sharma celebrates 29th birthday with wife ritika

టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన టీమీండియా సహచరులు లేకుండానే తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇవాళ్టితో 29వ పడిలో అడుగుపెట్టిన రోహిత్ శర్మకు ఆయన  చిన్ననాటి స్నేహితురాలు, సతీమణి రితికా సజ్దే సరిగ్గా పన్నెండు గంటలకు కేట్ కట్ చేయించింది. అమెతో పాటు సన్నిహితుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేసిన రోహిత్... 30వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తనకంటూ ఓ గుర్తింపును రోహిత్ సాధించాడు. ఆరంభంలో నిలకడ లేమితో సతమతమైన రోహిత్... ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సత్తా చాటాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలోనే ఏ ఒక్కరికీ సాధ్యం కాని ఫీట్ ను అతడు సాధించాడు.

వన్డే క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన అతడు... వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు(264)ను తన పేరిట లిఖించుకున్నాడు. అందుకే... భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన బర్త్ డే విషెస్ లో ఐసీసీ... రోహిత్ ను ఆకాశానికెత్తేసింది. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన క్రికెటర్ గానే కాక తక్కువ సమయంలోనే 5 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడని అతడిని ఐసీసీ కీర్తించింది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  ipl 2016  ipl9  mumbai indians  ritika sajdeh  happy birthday  

Other Articles