Shashank Manohar elected as ICC chairman for 2-year term

Shashank manohar elected unopposed as independent icc chairman

shashank manohar, manohar, shashank, shashank manohar bcci, bcci president, shashank icc, icc president, icc chairman, icc cricket, cricket news, cricket

Shashank Manohar has been elected unopposed as the first independent chairman of the International Cricket Council (ICC), the governing body said on Thursday.

ఐసీసీ చైర్మెన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన శశాంక్ మనోహర్

Posted: 05/12/2016 06:29 PM IST
Shashank manohar elected unopposed as independent icc chairman

బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా, ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యాడు. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి అధ్యక్షుడిగా ఉండాలని ఉన్నప్పటికీ ఐసీసీ చైర్మన్ పదవి కోసం రాజీనామా చేశానని శశాంక్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. క్రికెట్ బోర్డు గర్వించేలా చేస్తానని, ఇతర భాగస్వాములతో కలసి పనిచేసి క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్తానని చైర్మన్ గా ఎన్నికయిన సందర్భంగా శశాంక్ పేర్కొన్నాడు.

బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శశాంక్ ఇవాళ ఐసీసీ అత్యున్నత పదవిని చేపట్టాడు. ప్రస్తుత ఎన్నికతో ఆయన ఈ పదవిలో మరో రెండేళ్ల వరకూ కొనసాగుతారు. ఐసీసీ డైరెక్టర్స్ ఒక అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తారు. ఆ క్యాండిడేట్ పేరును ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది డైరెక్టర్లు బలపరచాలి. అయితే ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవికి జరగనున్న ఎన్నికలకు గానూ శశాంక్ ఒక్కరి పేరు ప్రతిపాదించారు.

చైర్మన్ ఎన్నికను ఇండిపెండెంట్ ఆడిట్ కమిటీ చైర్మన్ అద్నాన్ జైదీ పర్యవేక్షించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికకు పాత పద్ధతికి చాలా మార్పులున్నాయి. గతంలో ఏ దేశానికి చెందిన క్రికెట్ బోర్డు అధ్యక్షులైనా ఐసీసీ చైర్మన్ బరిలో నిలిచే అవకాశం ఉండేది. దేశ క్రికెట్ బోర్డుతో సంబంధం లేదంటూ ఇండిపెండెంట్ గా ఈ బరిలో నిలిచి ఎన్నికైన మొదటి వ్యక్తిగా శశాంక్ మనోహర్ నిలిచాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Shashank Manohar  ICC chairman  Cricket  

Other Articles