Azhar: Ravi Shastri shown a womaniser, angry with makers of the film

Ravi shastri angry with his portrayal in the movie azhar

azhar, azhar movie, ravi shastri, gautam gulati, ravi shastri cheating, ravi shastri womaniser, ravi shastri in azhar, azhar reviews, emraan hashmi azhar, azharuddin biopic

Emraan Hashmi's Azhar has left former Indian cricketer Ravi Shastri red-faced

‘అజార్’లో తన పాత్ర చిత్రీకరణపై మండిపడ్డ క్రికెటర్

Posted: 05/17/2016 07:30 PM IST
Ravi shastri angry with his portrayal in the movie azhar

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ జీవితం వివాదాలమయం. ఇప్పుడు ఆయన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇమ్రాన్‌ హష్మీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజగా మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి కూడా ఈ చిత్రంలో తన పాత్రను చిత్రించిన తీరు చూసి షాక్‌ తిన్నాడంట. తనను ఇంత దారుణంగా సినిమాలో చూపిస్తారా? అని ఆయన మండిపడుతున్నట్టు తెలుస్తోంది.  

'అజార్‌' సినిమాలో రవిశాస్త్రి పాత్రను గౌతం గులాటీ పోషించాడు. సినిమాలో ఏ క్రికెటర్‌ పేరును పూర్తిగా ఉపయోగించలేదు. కానీ అజార్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు సహ క్రికెటర్లు పిలుచుకొనే పొట్టిపేర్లనే ఇందులో వాడారు. అందులో భాగంగానే అజార్‌, రవి, నవజ్యోత్, మనోజ్‌, కపిల్‌ వంటి పేర్లను ఉపయోగించారు. వీళ్లందరూ అజార్‌తో కలిసి క్రికెట్‌ ఆడినవాళ్లే. కాబట్టి సహజంగానే సినిమాలో వీరి ప్రస్తావన ఉంటుందని అంతా భావించారు.

అయితే, గౌతం గులాటీ 'రవి'గా కనిపించిన పాత్రను పూర్తిగా స్త్రీలోలుడిగా చిత్రించడం, ఓ సీరిస్‌ సందర్భంగా తన వెంట ఉన్న భార్యను మోసం చేసి అతను అమ్మాయితో గడిపినట్టు చూపించడం రవిశాస్త్రిని దిగ్భ్రాంత పరిచిందట. రవిశాస్త్రి కుటుంబం కూడా ఆయనను ఇలా చూపించారేమిటని మండిపడుతున్నారు. తన పాత్రను చూపించిన తీరును తప్పుబడుతూ ఇప్పటికే రవిశాస్త్రి బీసీసీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

తన పాత్రను తప్పుగా చూపించడంపై ఇప్పటికే మనోజ్‌ ప్రభాకర్‌ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని 'అజార్‌' చిత్రయూనిట్‌ను హెచ్చరించారు. అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లానీ కూడా సినిమాలో తనను చూపిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా ఈ జాబితాలో తాజాగా రవిశాస్త్రీ కూడా జత కలిశాడు, అయితే అజారుద్దీన్‌కు రవిశాస్త్రికి పాత గొడవలు ఉన్నాయని చిత్రంలో ఆయన పాత్రను అలా చిత్రీకరించడానికి అవే కారణమన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Shastri  womaniser  Azhar  Emraan Hashmi  

Other Articles