RPS vs KXIP : Dhoni's Blistering Fifty Takes Pune Supergiants Home In Thriller vs Kings XI

Dhoni the finisher shines as pune supergiants beat punjab by 4 wickets

Cricket,IPL 9,ACA-VDCA Stadium, Visakhapatnam,Murali Vijay,MS Dhoni,Kings XI Punjab,Rising Pune Supergiants

A blistering 64-run knock from skipper MS Dhoni helped Rising Pune Supergiants seal a thriller against Kings XI Punjab at Vizag.

ముగింపు మ్యాచ్ లో పంజాబ్ పై ధోని అలజడి..

Posted: 05/22/2016 11:14 AM IST
Dhoni the finisher shines as pune supergiants beat punjab by 4 wickets

బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా తనకున్న ఖ్యాతిని మరోమారు రుజువు చేసుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని. పూణే సూపర్ జయింట్స్ కెప్టన్ ధోని తనదైన  స్టైల్ లో క్రితం రోజు రాత్రి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో అలజడి సృష్టించాడు. ఆఖరి మ్యాచ్‌లో పుణే విజయానికి అవసరమైన 16 పరుగులను మిగిలివున్న మూడు బంతుల్లనే సాధించి ధోని దుమ్మురేపాడు. తన బ్రాండ్ షాట్లతో... చాలాకాలం తర్వాత మ్యాచ్‌ను ‘ఫినిష్’ చేశాడు. ఓ బౌండరీ, రెండు సిక్సర్లతో పుణేకు చిరస్మరణీయ విజయాన్ని అందించి... లీగ్‌లో ఆఖరి స్థానం బాధ నుంచి జట్టును తప్పించాడు.

కెప్టెన్ ధోని (32 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో పుణే జట్టు నాలుగు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయం సాధించింది. పుణే ఏడోస్థానంతో, పంజాబ్ ఆఖరి స్థానంతో సీజన్‌ను ముగించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్... 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. మురళీ విజయ్ (41 బంతుల్లో 59; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గురుకీరత్ సింగ్ (30 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించగా... హషీమ్ ఆమ్లా (27 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఆకట్టుకున్నాడు.  అశ్విన్ 4 వికెట్లు తీశాడు.

రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు కేవలం 62 పరుగులు మాత్రమే చేసిన ధోని... ఇన్నింగ్స్‌లో చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు చేయడం విశేషం. విజయానికి 49 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన దశలో క్రీజులోకి వచ్చిన ధోని... పెరీరా (14 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్సర్) సహాయంతో ధాటిగా ఆడాడు. చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సి ఉండగా మోహిత్ శర్మ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి పుణేను కట్టడి చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 23 పరుగులు అవసరం కాగా... ధోని సింగిల్స్ కూడా తీయకుండా ఈ ఓవర్లో మొత్తం మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి పుణేను గెలిపించడం విశేషం.

స్కోరు వివరాలు: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) బెయిలీ (బి) అశ్విన్ 30; విజయ్ (బి) అశ్విన్ 59; సాహా (సి) అశ్విన్ (బి) జంపా 3; గురుకీరత్ (సి) చాహర్ (బి) అశ్విన్ 51; మిల్లర్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 7; బెహర్డీన్ (సి) రహానే (బి) దిండా 5; అక్షర్ పటేల్ (సి) తివారీ (బి) పెరీరా 1; రిషి ధావన్ (నాటౌట్) 11; అబాట్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 172.

వికెట్ల పతనం: 1-60; 2-65; 3-123; 4- 150; 5-154; 6-160; 7-160.  బౌలింగ్: పఠాన్ 4-0-37-0; దిండా 3-0-16-1; చాహర్ 3-0-28-0; పెరీరా 2-0-24-1; అశ్విన్ 4-0-34-4; జంపా 4-0-32-1.

పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి) సాహా (బి) సందీప్ 19, ఖవాజా (సి) మిల్లర్ (బి) గురుకీరత్ 30; బెయిలీ (స్టం) సాహా (బి) పటేల్ 9; తివారీ (సి) బెహర్డీన్ (బి) గురుకీరత్ 17; ధోని నాటౌట్ 64; ఇర్ఫాన్ (సి) సాహా (బి) ధావన్ 2, పెరీరా (సి) సాహా (బి) మోహిత్ 23; అశ్విన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం ( 20 ఓవర్లలో 6 వికెట్లకు) 173.

వికెట్ల పతనం: 1-35, 2-47, 3-78, 4-80, 5-86, 6-144.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-29-1; మోహిత్ శర్మ 4-0-39-1; అబాట్ 3-0-25-0; అక్షర్ 4-0-43-1; గురుకీరత్ 2-0-15-2; రిషి ధావన్ 3-0-21-1.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles