IPL 9: mumbai indians vs gujarat lions, Bravo-Pollard tussle

Dwayne bravo and kieron pollard nearly come to blows

Bravo Pollard tussle, Bravo Pollard tussle ipl 9, gujarat lions, mumbai indians, Kieon Pollard, Sunil Narine, two-year exile, international cricket, West Indies Cricket Board (WICB), Australia, South Africa, tri series, Chris Gayle, Dwayne Bravo, Darren Sammy

Dwayne Bravo and Kieron Pollard were involved in a tussle during the Indian Premier League game between Gujarat Lions and Mumbai Indians.

మైదానంలో సమరానికి సై అంటున్న విండీస్ ఆటగాళ్లు

Posted: 05/22/2016 02:49 PM IST
Dwayne bravo and kieron pollard nearly come to blows

వారిద్దరూ ఒకే దేశానికి చెందిన క్రికెటర్లు, కానీ ఐపీఎల్ లో మాత్రం వారు వేరే వేరే జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితేనేం మైదానంలోనే వారు సమరానికి సై అన్నట్లుగా కాలుదువ్వారు. తమ దేశ క్రికెట్ బోర్డుతో గొడవల కారణంగా ప్రస్తుతం రెండుగా చీలిపోయిన వెస్టిండీస్‌ క్రికెటర్లు ఐపీఎల్‌ మ్యాచ్ వేదికగా బాహాబాహికి సిద్ధపడుతున్నారు. గుజరాత్ లయన్స్‌-ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ సందర్భంగా వెస్టిండీస్‌ ఆటగాళ్లు పొలార్డ్‌-బ్రావో ఏకంగా కొట్టుకునేందుకు సిద్ధపడటం తాజాగా కలకలం రేపుతున్నది.

మ్యాచ్‌ 14వ ఓవర్‌ లో డ్వేన్‌ బ్రావో జోస్‌ బట్లర్‌ (33)ను ఔట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో బట్లర్‌-నితీశ్‌ రాణా జోడీ 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాట్స్‌మన్ కీరన్‌ పొలార్డ్‌ క్రీజులోకి వచ్చాడు. బ్రావో చివరి బంతిని ఎదుర్కొనే సమయంలో అతను క్రీజ్‌ దాటి ముందుకొచ్చాడు. బంతి వేసిన తర్వాత పొలార్డ్ దిశగా దూసుకొచ్చిన బ్రావో అతన్ని భుజాన్ని రాసుకుంటూ వెళ్లాడు. దీంతో ఆగ్రహంగా చూసిన పొలార్డ్‌ అవసరమైతే బ్రావో తలమీద బ్యాటుతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు బ్యాటు ఎత్తి పట్టుకున్నాడు. ఆగ్రహంగా ఉన్న పొలార్డ్ ని చూస్తూ నవ్వుతూ బ్రావో వెళ్లిపోయాడు. ఈ ఘటన మైదానంలో కాస్తా ఉద్రిక్తత రేపింది.

అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా రెండేళ్లుగా కొనసాగుతున్న బహిష్కరణ వేటు ముగిసిపోవడంతో కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్‌ను వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు తిరిగి జట్టులోకి తీసుకుంది. అదే సమయంలో సీనియర్ ఆటగాళ్లైన క్రిస్‌ గేల్‌, బ్రావో, డారెన్ సమీలపై వేటు వేసింది. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా ట్రైసీరిస్‌కు వారిని ఎంపిక చేయలేదు. దీంతో ఆగ్రహంగా ఉన్న ఈ ముగ్గురు క్రికెటర్లు ట్విట్టర్‌లో బోర్డు మీద తీవ్ర విమర్శలు చేశారు. దీంతో బోర్డుకు అనుకూలంగా ఉన్న పొలార్డ్‌, నరైన్‌లపై, రెబల్ క్రికెటర్లైన ముగ్గురు భగ్గుమంటున్నారు. దీంతో ఈ రెండు గ్రూపులకు మధ్య విభేదాలు తాజా ఐపీఎల్‌లోనూ కనిపిస్తున్నాయి

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  England  Alastair Cook  sachin Tendulkar  ten thousand runs  Cricket  

Other Articles