ఒక జట్టులో చూస్తే హిట్టర్లు..చెలరేగితే భారీ స్కోరు ఖాయం. మరో జట్టులో అత్యుత్తమ బౌలర్లు. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో రికార్డు. ఈ రెండు జట్లు ఎలిమినేటర్ రౌండ్లో తలపడటానికి రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బుధవారం రాత్రి గం.8.00లకు ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్లే ఆఫ్ దశలో జరిగే ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే.
అయితే ఈ మ్యాచ్ లో కోల్ కతానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అంతకుముందు లీగ్ దశలో కోల్ కతా తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సన్ రైజర్స్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో కోల్ కతాపై సన్ రైజర్స్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరో వైపు సన్ రైజర్స్పై 'హ్యాట్రిక్' విజయం సాధించి రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించాలని కోల్ కతా యోచిస్తోంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.
ఒకవైపు కోల్ కతా జట్టులో కెప్టెన్ గౌతం గంభీర్‌తో పాటు రాబిన్ ఉతప్ప, మున్రో, యూసఫ్ పఠాన్, మనీష్ పాండే వంటి స్టార్ ఆటగాళ్లుండగా, మరోవైపు డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, విలియమ్సన్ లతో సన్ రైజర్స్ పటిష్టంగా ఉంది. కాగా, లీగ్ దశలో చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట ఓటమి పాలుకావడం సన్ రైజర్స్ జట్టులో ఆందోళన పెంచుతుంది. దాదాపు కోల్ కతా పరిస్థితి కూడా ఇలానే ఉన్నా కాస్త మెరుగ్గా ఉంది. మరి కోల్ కతా హ్యాట్రిక్ సాధిస్తుందా?లేక సన్ రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా?అనేది మాత్రం ఆసక్తికరమే. ఫిరోజ్ షా కోట్ల మైదానం బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి మ్యాచ్‌లో టాస్ కూడా కీలక పాత్ర పోషించనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more