అర్తులను అదుకోవడంలోనూ తమకు సాటిలేదని నిరూపించారు టీమిండియా క్రికెటర్లు. ఆర్తుల కోసం బ్యాటు పట్టి వీరబాదుడు బాదిన బాట్స్ మెన్లు, సినీమా స్టార్లను మరిపించేలా స్టెపులేసి మరీ అదరగోట్టారు. అసలు విషయానికి వస్తే.. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్, మరో ఛారిటీ సంస్థ స్మైల్ ఫౌండేషన్ తో చేతులు కలిపింది. ముంబయి నగరంలో గత రాత్రి క్రికెటర్ విరాట్ కోహ్లీ టీమిండియా ఆటగాళ్లతో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాషింగ్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీలు స్టెప్పులతో అదరగొట్టారు. వీరికి తోడు యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా జత కలిసి తన డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు. నిరుపేద చిన్నారులు, యువతలో స్పూర్తి పొంపేందించేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. దాదాపు 4 లక్షల మంది చిన్నారులకు విద్య, నిరుద్యోగులకు శిక్షణ లాంటి కార్యక్రమాల కోసం శ్రీకారం చుట్టారు. భారతదేశంలోని నిరుపేద చిన్నారులకు విద్యను అందించడం, నిరుద్యోగ యువతకు మార్గదర్శనం చేయడం ఈవెంట్ ముఖ్య లక్ష్యమని కోహ్లీ పేర్కొన్నాడు.
చాలా మంది ప్రముఖులు చేయూత అందించేందుకు, తమతో భాగస్వామ్యం అందుకోవడానికి ఇక్కడికి విచ్చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్బంగా కోహ్లీ, ఎం.ఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ చిన్నారులతో కలిసి ఫొటోలు దిగి వారికి సంతోషాన్ని పంచారు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కె.ఎల్ రాహుల్, అజింక్యా రహానే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. వీరితో పాటు ఆకాశ్ అంబానీ, గౌతమ్ సింఘానియా, నికిల్ చతుర్వేది, దిగ్విజయ్ సిన్హ్ కతివాడా, ఇతర ప్రముఖులు విరాట్ ఫౌండేషన్ ఈవెంట్ కు హాజరై తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more