Rahane ready for West Indies challenge, says preparations on track

Virat kohli and i have always been aggressive says ajinkya rahane

Ajinkya Rahane, Virat Kohli,ajinkya rahane, rahane, india cricket team, india cricket, cricket india, india vs west indies, ind vs wi, West Indies vs India Test series, Latest sports news, cricket news, cricket

India's Test vice-captain Ajinkya Rahane says he prepares himself technically as well as mentally ahead of every series and is focused on doing well.

దూకుడు కొనసాగించడం అంటే ఇష్టమట..

Posted: 07/01/2016 06:16 PM IST
Virat kohli and i have always been aggressive says ajinkya rahane

ఇటీవల కాలంలో తన ఆట తీరు ఎంతో మెరుగైందని టాపార్డర్ ఆటగాడు అజింక్యా రహానే స్పష్టం చేశాడు. తాను అంతర్జాతీయ అరంగేట్రం చేసే నాటికీ, ఇప్పటీకీ తన ఆటలో చాలా మార్పు వచ్చిందన్నాడు.  భారత క్రికెట్ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తరహాలో తనకు కూడా ఎప్పుడూ దూకుడును కొనసాగించడమంటే ఇష్టమన్నాడు. ఈ సందర్భంగా 2013లో డర్బన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ను రహానే ప్రస్తావించాడు. 'ఆ మ్యాచ్లో విరాట్ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశామని గుర్తుచేసుకున్నాడు.

‘తొలి ఇన్నింగ్స్లో 51 పరుగులతో అజేయంగా నిలిస్తే.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులతో సెంచరీని కోల్పోయాను. అది నాకు అరంగేట్రం టెస్టు మ్యాచ్. అయితే నేను బ్యాటింగ్ చేసే సమయంలో డేల్ స్టెయిన్ వేసిన ఒక బంతి నా హెల్మెట్కు తగిలింది. ఆ సమయంలో విరాట్ వచ్చి ఎదురుదాడికి దిగమన్నాడు. దానికి సానుకూలంగా స్పందించి దక్షిణాఫ్రికా బౌలింగ్ పై ఎటాక్ చేశా. దాంతో మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాం. ఇదే తరహా ఆటతీరు మా మధ్య ఆది నుంచి కొనసాగుతుంది రహానే చెప్పుకోచ్చాడు.

తామిద్దరం సహకరించుకునే తీరు బాగుంటుందని పేర్కోన్నాడు. విరాట్తోపాటు తాను కూడా దూకుడును కొనసాగించడానికి ఎప్పుడూ వెనుకాడలేదఅని రహానే తెలిపాడు. అయితే తమ ఇద్దరి దూకుడులో మాత్రం వ్యత్యాసముందని పేర్కొన్న రహానే.. తమ ఇద్దరి కాంబినేషన్ మాత్రం సక్సెస్ అయినట్లు తెలిపాడు. వీరిద్దరూ 21 టెస్టుల్లో 54.70 సగటుతో 1094 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇందులో మూడు సెంచరీల భాగస్వామ్యం కూడా నమోదు కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Ajinkya Rahane  West Indies vs India Test series  India  cricket  

Other Articles