Ravi Shastri defends himself from Sourav Ganguly salvo, says interview was at short notice

Ravi shastri hits back at sourav ganguly again

Indian Cricket,Anil Kumble,Sourav Ganguly,Ravi Shastri,Cricket.anil kumble,new India coach,New India coach Kumble,Anil Kumble India coach,BCCI Advisory Committee,Laxman conflict of interest,bcci,Ajay Shirke,Ravi Shastri, sourav ganguly

The personal clash between Ganguly and Shastri in the aftermath has overshadowed the coach selection process.

గంగూలీపై మరోసారి విరుచుకుపడ్డ రవిశాస్త్రీ

Posted: 07/02/2016 07:38 PM IST
Ravi shastri hits back at sourav ganguly again

భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి ఎంపిక సందర్భంగా బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ, మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిల మధ్య రాజుకున్న వివాదం ఇప్పట్లో చల్లారేలా కనబడటం లేదు. 'నాకు నీతులు చెబుతావా?, పిచ్చోళ్ల ప్రపంచంలో విహరిస్తున్నట్లున్నావు. కోచ్ ఇంటర్య్వూకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై నీతులు చెప్పొద్దు'అన్న గంగూలీ వ్యాఖ్యలపై రవిశాస్త్రి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు తాను ఎందుకు స్కైప్ ద్వారా ఇంటర్య్యూకి హాజరు కావాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ.. ఆ అవకాశాన్ని తనకు బీసీసీఐ కల్పించదని గంగూలీపై మండిపడ్డాడు.

'జూన్ 15వ తేదీన థాయ్లాండ్ వెళ్లా. 19వ తేదీ వరకూ బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నా. అయితే ఇంటర్య్వూ తేదీ ఆకస్మికంగా ప్రకటించారు. ఈ విషయం కోచ్ అభ్యర్ధులకూ ఎవరికీ తెలీదు. దాంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్య్వూలో పాల్గొన్నా. వీడియో కాన్పరెన్స్ ఆప్షన్ను బీసీసీఐ ఇచ్చింది. నేను బయట దేశంలో ఉన్నందును ఆ ఆప్షన్ ను ఎంచుకున్నాను. టామ్ మూడీతో పాటు కొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఇంటర్య్వూ ఇచ్చారు. వారికి నాకు వ్యత్యాసం ఏమిటి?అని రవిశాస్త్రి ఘాటుగా ప్రశ్నించాడు.

తనను ఇంటర్య్యూ చేసేటప్పుడు గంగూలీ ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది అని రవిశాస్త్రి ప్రశ్నించడంతో వివాదం రాజుకుంది. బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో సభ్యుడైన గంగూలీ బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదంటూ రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేశాడు.  దీనికి గంగూలీ ధీటుగా స్పందించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. తనకు నీతులు చెప్పొద్దని,  నువ్వెందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్య్వూ ఇచ్చావని గంగూలీ ప్రశ్నించాడు.  దానికి తోడు రవిశాస్త్రి పిచ్చోళ్ల ప్రపంచంలో విహరిస్తున్నట్లు ఉన్నాడని తీవ్రంగా వ్యాఖ్యానించాడు. దీంతో గంగూలీ వ్యాఖ్యలను రవిశాస్త్రి తిప్పికొట్టే యత్నం చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian coach  Ravi Shastri  Sourav Ganguly  BCCI  allegations  cricket  

Other Articles