AB de Villiers helps Barbados canter to easy win

De villiers malik guide tridents to first win

AB de Villiers, CPL, Barbados Tridents, St Kitts and Nevis Patriots, Barbados, St Kitts and Nevis Patriots vs Barbados, Caribbean Premier League, 2016, cricket, Cricket, latest cricket news

AB de Villiers helped Barbados Tridents seal their maiden win of the Caribbean Premier League 2016 at Warner Park in St Kitts

కరేబియన్ క్రికెట్ లీగ్లో దుమ్మురేపిన డివిలియర్స్..

Posted: 07/06/2016 09:03 PM IST
De villiers malik guide tridents to first win

ఏబీ డివిలియర్స్ మరోసారి దుమ్ము రేపాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో విజృంభించి ఆడి అజేయ అర్ధశతకంతో తన జట్టు బార్బడోస్ ట్రైడెంట్స్ కు విజయాన్ని అందించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో బార్బడోస్ టీమ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగులుండగానే ఆధిగమించింది. 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.

డివిలియర్స్ తనదైన శైలిలో చెలరేగి 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు. షోయబ్ మాలిక్(54) అర్ధ సెంచరీతో రాణించాడు. పొలార్డ్ 25, పార్నెల్ 16 పరుగులు చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన నెవిస్ పాట్రియట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. లెవిస్ 50, కార్టర్ 41, థామస్ 21, స్మట్స్ 14, బ్రాత్ వైట్ 11 పరుగులు సాధించారు. డివిలియర్స్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కించుకున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AB de Villiers  CPL  Barbados Tridents  Cricket  

Other Articles