ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా పయనిస్తున్న లంకేయులను అసీస్ బౌలర్ స్టార్క్ తన మాయాజాలంతో దెబ్బతీశాడు. 86 పరుగులకు నాలుగు వికెట్లు కొల్పోయి పీకల్లోతు కష్టాల్లో వున్న శ్రీలంకను ఐదవ వికెట్ కు దినేష్ చండీమల్ తో కలసి 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మెండీస్ ఒక్కడే కేవలం 169 పరుగులను సాధించగా, అ తరువాత నిలకడగా రాణిస్తున్న లంక బ్యాట్స్ మెన్లను స్టార్క్ పెవిలియన్ కు పంపించాడు.
దీంతో ఆస్ట్రేలియాతో జరగుతున్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య శ్రీలంక 353 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి ఆసీస్ ముందు 268 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులు చేయగా, ఆసీస్ తమ తొలిఇన్నింగ్స్ లో 203 పరుగులకు ఆలౌటైంది. ఆరు వికెట్ల నష్టాకి 282 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగోరోజు బ్యాటింగ్ కు దిగిన లంకను స్టార్క్ మరోసారి దెబ్బతీశాడు. అతిపిన్న వయస్సులో శతకాన్ని నమోదు చేసిన కుశఆల్ మెండిస్ ను త్వరగా పెవీలియన్ కు పంపించాడు.
మూడవ రోజు అట ముగిసే సమయానికి 169 పరుగుల సాధించిన మెండిస్ ను ఏడు పరుగులు జత కలపుగానే అంటే 176 పరుగుల వద్ద ఔట్ చేశాడు. మెండిస్ (254 బంతుల్లో 176 పరుగులు; 21 ఫోర్లు, 1 సిక్స్)ను త్వరగానే ఏడో వికెట్ గా పెవిలియన్ బాట పట్టిన తరువాత చివర్లో హెరాత్(34 బంతుల్లో 35 పరుగులు; 6 ఫోర్లు ) రాణించడంతో లంక 350 మార్క్ చేరుకుంది. హెరాత్ ను హెజెల్‌వుడ్ ఔట్ చేయడంతో లంక్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లలో హెజెల్‌వుడ్, నాథన్ లియోన్ చెరో రెండు వికెట్లు తీశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more