శ్రీలంక పర్యటనలో భాగంగా ఆతిధ్యజట్టుతో మూడు టెస్టుల సీరిస్ లో తొలిటెస్టు ఓడిన ఆస్ట్రేలియా రెండో టెస్టులో బాగా రాణించి విజయాన్ని అందుకోవాలని భావించింది. అయితే అసీస్ కు పూర్తి భిన్నంగా రెండో టెస్టు కూడా సాగుతుంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 106 పరుగులకు లంకేయులను కట్టడి చేసిన లంకేయులు.. అదే దూకుడుతో ముందుకు దూసుకెళ్తున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో 281 పరుగులకు శ్రీలంక అలౌట్ అయ్యింది.
అయితే రెండో ఇన్నింగ్స్ లో 237 పరుగులకు లంకేయులు అలౌట్ అయ్యారు. దీంతో రెండు టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 413 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అసీస్ ను రంగనా హెరత్ తన రికార్డు బౌలింగ్ తో కంగారెత్తించాడు. సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో మూడు వరుస బంతులకు బోల్తాపడ్డారు కంగారులు. శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్ టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించి ఆసిస్ ఆటగాళ్లను ముంచేశాడు. హెరాత్‌కు ఇది తన కెరీర్లో మొదటి టెస్ట్ హ్యాట్రిక్ కాగా, శ్రీలంక తరుపున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
అంతకుముందు నువాన్ జోయ్సా మాత్రమే టెస్టు మ్యాచ్‌లలో హ్యాట్రిక్ సాధించిన ఏకైక శ్రీలంక బౌలర్. 1999లో జింబాబ్వే జట్టుపై హ్యాట్రిక్ ఫీట్‌ను సాధించాడు నువాన్. అయితే మళ్లీ ఇన్నాళ్లకు హెరాత్ ఆ ఘనత సాధించాడు. ఆసిస్‌తో జరిగిన సెకండ్ టెస్ట్‌లో వరుసగా ఆడమ్ వోగ్స్(8), పీటర్ నెవిల్(0), మిచెల్ స్టార్క్(0)లను పెవిలియన్‌కు పంపించాడు స్పిన్ మాంత్రికుడు రంగానా హెరాత్. దీంతో ఆరు ఓవర్లలో 25 పరుగులు సాధించిన అసీస్ మూడు టాప్ అర్ఢర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more