నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మూడవ టెస్టులో ఫలితం తేలుతుందా.? లేక డ్రాగానే ముగుస్తుందా..? అన్న ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. తొలి టెస్టులో విజయం సాధించి పైచేయి సాధించిన టీమిండియా రెండో టెస్టు వరణుడి కారణంగా డ్రాగా మగించింది. ఇక మూడో టెస్టు కూడా వర్షం కారణంగా ఒక రోజు పూర్తి ఆటకు భంగం కలిగించింది. ఈ నేపథ్యంలో మూడో టెస్టు కూడా ఫలితం తేలకుండానే ముగుస్తుందా..? లేక ఫలితం వస్తుందా అన్న సందేహాలు క్రికెట్ అభిమానుల్లో రేకెత్తుతున్నాయి.
వెస్టిండీస్ను మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 225 పరుగులకే కట్టడి చేసి పైచేయి సాధించిన భారత్ తన రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దీంతో భారత్కు 285 పరుగుల ఆధిక్యం లభించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా క్రితం రోజు ఆట ముగిసే సమయానికి అజింక్యా రహానే(51 బ్యాటింగ్), రోహిత్ శర్మ(41) క్రీజ్లో ఉన్నారు. ఆటకు శనివారం చివరిరోజు కావడంతో టెస్టు మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాగా, ఆఖరి రోజు ఆటలో భారత్ తన ఇన్నింగ్స్ ను తొందరగా ముగించి ఫలితం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.
అంతకుముందు భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి వెస్టిండీస్ జట్టు కుప్ప కూలింది. భువనేశ్వర్ ఐదు వికెట్లు సాధించడంతో భారత్కు 128 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. విండీస్ ఇన్నింగ్స్లో బ్రాత్‌వైట్ (163 బంతుల్లో 64; 6 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (109 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు విఫలమయ్యారు. విండీస్ మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండర్స్ పూర్తిగా విఫలం కావడంతో కేవలం 225 పరుగులకే అలౌట్ అయ్యింది. ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో టెస్టులో ఫలితం రాబట్టి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా వ్యూహరచన చేస్తుంది.
భారత తొలి ఇన్నింగ్స్ 353 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 157/3
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 225 ఆలౌట్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more