ప్రపంచ టీ-20 పోటీల్లో సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయంగా టీ 20 మ్యాచ్ లో కంగారుల పరుగుల సునామీ సృష్టించి దానిని తమ ఖాతాలో వేసుకున్నారు. శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య పల్లికెలెలో జరిగిన తొలి టీ-20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో ఓపెనర్ జీజే మ్యాక్స్ వెల్ రెచ్చిపోయాడు. కేవలం 65 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్ లతో విరుచుకుపడి 145 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 263 పరుగుల భారీ స్కోరును ఆస్ట్రేలియా చేయగా, దాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక, 178 పరుగులకే పరిమితమైంది.
లంక ఆటగాళ్లలో చండిమాల్ (58), కపుడెగర (43) తప్ప మరెవరూ రాణించలేదు. ఈ మ్యాచ్ తో ఓపెనర్ గా దిగి ఆడిన తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా మ్యాక్స్ వెల్ నిలిచాడు. టీ-20ల్లో ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద స్కోరు. తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను ఏ లంక బౌలర్‌ను కూడా వదిలి పెట్టలేదు. 49 బంతుల్లోనే అతను సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సేనానాయకే వేసిన ఒక ఓవర్లో 3 సిక్సర్లు, ఫోర్లతో 23 పరుగులు రాబట్టిన మ్యాక్సీ చివరకు అజేయంగా నిలిచాడు.
2013 ఐపీఎల్ పోటీల్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పుణె వారియర్స్ పై 263 పరుగులు చేయగా, ఇప్పుడు ఆస్ట్రేలియా దాన్ని సమం చేసింది. రెండు దేశాల మధ్య జరిగిన పోరులో ఈ స్కోరే అత్యధికం కాగా, వ్యక్తిగత అత్యధిక పరుగుల రికార్డును మాత్రం మ్యాక్స్ వెల్ తాకలేకపోయాడు. 2013లోనే ఇంగ్లండ్ తో సౌతాంప్టన్ లో జరిగిన టీ-20లో ఆస్ట్రేలియాకు చెందిన ఏజే ఫించ్ 63 బంతుల్లో 156 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more