అస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన కెరీర్లోనే చిరస్మరణీయమైనదిగా అభివర్ణించిన టెస్టు సిరీస్ ఏదో తెలుసా..? దాదాపు 16 సంవత్సరాల క్రితం భారత్ హోం గ్రౌండ్ లో ఆడిన టెస్టు సిరీసే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే పేర్కొన్నాడు. 2001లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆ దైపాక్షిక టెస్టు సిరీస్ తన కెరీర్లోనే అద్భుతమైనదని పాంటింగ్ స్పష్టం చేశాడు. ఆ సిరీస్‌లో తాము ఓడినప్పటికీ, క్రికెట్ ఏ స్థాయిలో ఉండాలో అదే తరహాలో ఆ సిరీస్ జరిగిందన్నాడు. ఇటీవల ఓ సందర్బంగా తనను హర్భజన్ సింగ్ ఇప్పటికే కలలోకి వచ్చి భయపెడుతుంటాడని చెప్పిన పాంటింగ్ ఇవాళ మరికొన్ని విషయాలను గుర్తుచేసుకున్నాడు.
అయితే ఈ సిరీస్ లో కూడా ప్రత్యేకంగా కోల్ కతా నగరంలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన టెస్టు మ్యాచ్ మాత్రం సిరీస్‌కే హైలైట్ అని పాంటింగ్ తెలిపాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తాము భారీ ఇన్నింగ్స్ చేసి భారత్ ను ఫాలో ఆన్‌లోకి నెట్టినా, ఆ తరువాత ఆ జట్టు పుంజుకున్న తీరు అమోఘమన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో వీవీఎస్ లక్ష్మణ్ చేసిన 280 పరుగులు, రాహుల్ ద్రవిడ్ చేసిన 180 పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయన్నాడు. వారిద్దరి పోరాట పటిమతో ఆ మ్యాచ్ తమ చేయి జారిందని తెలిపాడు.
ఆ తరువాత చెన్నైలో చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో టెస్టు కూడా అత్యంత ఆసక్తిని రేపిందని తన గత జ్ఞాపకాల్ని పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా మరుపురాని విజయాన్ని కైవసం చేసుకుని సిరీస్‌ను 2-1 తో గెలుచుకుందన్నాడు. ఈ సిరీస్‌లో ముంబై లో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్లతో ఆస్ట్రేలియా విజయం సాధించిన తరువాత టీమిండియా పుంజుకున్న విధానం తన క్రికెట్ కెరీర్లోనే అరుదైన సిరీస్‌గా పాంటింగ్ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more