భారత క్రికెట్ ప్రధాన స్పిన్ అస్త్రం రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అద్భుత ప్రదర్శనతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. మూడు ఫార్మెట్లలో అశ్విన్ రాణిస్తున్నా.. బౌలర్ ప్రతిభకు కొలమానం, క్రికెట్ ఆటగాళ్ల నైపుణ్యానికి పరీక్షగా నిలచే టెస్టు మ్యాచ్ లేనన్న విషయం క్రికెట్ దిగ్గజాలు అంగీకరించే నిజం. ఐదు రోజుల మ్యాచ్ లో ఇటు బౌట్స్ మెన్ సహా అటు బౌలర్ రాణించాలంటే కూడా ఇదే మంచి వేదిక. ఇక ఈ ఫార్మెట్ లో మంచి ఊపుమీదున్న అశ్విన్‌ను మరో రికార్డ్ ఊరిస్తోంది.
అతితక్కువ మ్యాచుల్లో 200 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకూ కేవలం 36 మ్యాచులు మాత్రమే ఆడిన అశ్విన్ 193 వికెట్లను సాధించాడు. అత్యంత వేగవంతంగా 200 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రెమెట్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు డెన్నీస్ లిల్లీ, పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ పేరిట ఉంది. వీరిద్దరూ 38 టెస్టుల్లో 200 వికెట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
కాగా, ఈ నెల 22న (గురువారం) న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్ అశ్విన్‌కు 37వది కావడంతో వకార్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన గత సీరీస్‌లో రెండు సెంచరీలు, 17 వికెట్లతో పలు రికార్డులను సొంతం చేసుకున్న అశ్విన్ న్యూజీలాండ్ తో జరగనున్న చారిత్రాత్మక 500 టెస్టులో 200 వికెట్లు సాధించించాలని అయన అభిమానులు, టీమిండియా అభిమానులు అశిస్తూ అశ్విన్ కు అల్ ది బెస్ట్ చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more