క్రికెట్ పుట్టినిళ్లుగా పేరున్న బ్రిటన్ తన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్‌కు వేధికను ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఎడ్గ్బాస్టన్లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు
వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు వెస్టిండిస్‌తో తలపడనుంది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మొట్టమొదటి డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య గత ఏడాది జరిగింది. 138 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుతురులో సాగిన టెస్ట్‌గా ఆ మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది.
అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఎరుపు, తెలుపు బంతులు కాకుండా కొత్తగా గులాబీ రంగు బంతులను తొలిసారి వాడారు. కాగా, వచ్చే వారంలో పాకిస్తాన్, వెస్టిండిస్‌తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడునుంది. దీంతో డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిధ్యం ఇచ్చిన దేశాల్లో మూడో స్థానంలో బ్రిటన్ నిలువనుంది. పగలు పని చేసేవారు కూడా టెస్ట్ మ్యాచ్‌లను వీక్షిండానికి ప్రోత్సాహం కల్పించడమే తమ లక్ష్యం అని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. వచ్చే ఏడాది ఆగష్టు17-22 మధ్య జరిగే మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో వెస్టిండిస్‌తో తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more