బిసిసిఐకి స్వల్ప ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు దసరా సెలవులు SC stops BCCI funds to state cricket bodies

Supreme court stops bcci funds to state cricket associations

bcci, justice lodha, lodha, supreme court, lodha committee, anurag thakur, lodha supreme court, sc, bcci vs lodha, bcci lodha panel hearing, bcci lodha supreme court, bcci reply justice lodha, sports, sports news

SC told the BCCI's counsel that they have time till October 17 to consider submitting an undertaking to unequivocally comply with panel's recommendations.

బిసిసిఐకి స్వల్ప ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు దసరా సెలవులు

Posted: 10/07/2016 08:59 PM IST
Supreme court stops bcci funds to state cricket associations

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును గరవిస్తున్నాం అని అరు మాసాల క్రితం చెప్పిన బిసిసిఐ.. ఎలాంటి మార్పులు చేయకపోవడంతో క్రితం రోజు తీవ్రస్థాయిలో అక్షింతలు పడిన బోర్డుకు ఇవాళ స్వల్ప ఊరట లభించింది. నిన్నే మండిపాటు నేపథ్యంలో ఇవాళ తమపై న్యాయస్థానం ఏ తీరులో మండిపడుతుందోనన్న అందోళనకు గురైన బిసిసిఐకి సెలవులు ఊరటనిచ్చాయి, జస్టిస్ లోధా ప్రతిపాదనలు అమలులో జాప్యం చేస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి ఇప్పుడు సుప్రీంకోర్టు సెలవులు కలిసొచ్చాయి.

అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు దసరా సెలవులు రావడంతో ఇవాళ వెలువడుతుందనుకున్న తీర్పు కాస్తా ఈనెల 17వ తేదీ వరకూ వాయిదా పడింది. బీసీసీఐ వ్యతిరేకంగా లోధా కమిటీ దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం వెలువరించే అవకాశం ఉందని భావించారు. అయితే సుప్రీంకోర్టు కు సెలవులు రావడంతో మరో పదిరోజుల పాటు ఆ తీర్పు వాయిదా పడింది. కాగా బిసిసిఐ లోధా కమిటి సిఫార్సులను అమలు చేస్తామని బిసిసిఐ తీర్మానం చేయాలని అదేశించింది.

దాంతో ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న బీసీసీఐకి లోధా ప్యానల్ ప్రతిపాదనలపై మరింత కసరత్త చేసే సౌలభ్యం లభించింది. ఇది బీసీసీఐకి కాస్త ఊరట కల్గించినా, ఇప్పటికే ఆరంభమైన రంజీ ట్రోఫీ నిర్వహణపై ఎటువంటి సృష్టతా రాలేదు. ప్రస్తుతం ఈ టోర్నమెంట్ ను ఎలా నిర్వహించాలి అనే దానిపై ఎటువంటి ప్రణాళిక లేదని అసోసియేషన్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఒకవేళ రంజీ టోర్నీ నిర్వహించడానికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అది కూడా వాయిదా పడక తప్పదనే సంకేతాలిచ్చారు.

అయితే రాష్ట్ర శాఖలకు ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు శాఖలు కూడా లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని తీర్మాణం చేయాలని అదేశించింది. దాంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిర్వహణపై బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటీవల కాలంలో ఐపీఎల్ పై వినిపిస్తున్న కామెంట్లు అత్యంత వికారంగా మారాయంటూ అనురాగ్ లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. దాంతో ఐపీఎల్ నిర్వహణను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు నిర్ణయించాలంటూ అందులో పేర్కొన్నారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  supreme court  lodha committee  anurag thakur  cricket  

Other Articles