టేలర్ కెప్టెన్సీకి పనికిరాడు మెక్ కల్లమ్ మండిపాటు Brendon McCullum slams Ross Taylor's lack of leadership

Brendon mccullum slams ross taylor s lack of leadership

McCullum takes over as New Zealand captain, Brendon McCullum, Ross Taylor, Daniel Vettori, Mike Hesson, New Zealand cricket, cricket

Brendon McCullum has written of the uninspiring leadership of Ross Taylor and how the tension and mistrust during his captaincy left the New Zealand team on the verge of imploding.

టేలర్ కెప్టెన్సీకి పనికిరాడు మెక్ కల్లమ్ మండిపాటు

Posted: 10/25/2016 05:39 PM IST
Brendon mccullum slams ross taylor s lack of leadership

న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రాస్ టేలర్పై ఆ జట్టు మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఆయన కెప్టెన్సీకి పనికిరాడంటూ తేల్చిపారేశాడు. గతంలో న్యూజిలాండ్ కెప్టెన్సీ పగ్గాలు మోసిన టేలర్ ఎప్పుడూ పెదవి విప్పేవాడే కాదంటూ మెకల్లమ్ రాసిన 'డిక్లేర్' అనే బుక్లో ప్రస్తావించాడు. రాస్ టైలర్ న్యాయకత్వ లేమిపై ఒక ఛాప్టర్ నే ప్రత్యేకంగా రాసిన ఆయన.. కనీసం జట్టు సమావేశాల్లో కూడా రాస్ టేలర్ మౌన ముద్రలోనే ఉండేవాడంటూ ఆ పుస్తకంలో ప్రస్తావించాడు. అయనను కెప్టెన్సీకి ఎంపిక చేసిన పబ్లిక్ ప్రాసెస్ విధానమే సరైంది కాదని పేర్కోన్నాడు. ఇద్దరు జట్టులోనే కోనసాగునున్న నేపథ్యంతో పబ్లిక్ ఒక క్రికెటర్ ను తిరస్కరించడం కానీ లేక జట్టును తిరస్కించడం కానీ సహేతుకం కాదన్నాడు.

‘మా ప్రధాన కోచ్ మైక్ హెస్సెన్ ఎప్పుడూ ఆటగాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకునేవాడు. అయితే ఇందుకు కారణంగా కెప్టెన్ గా రాస్ టేలర్ ఎప్పుడూ జట్టు ప్రణాళికలు చెప్పకపోవడమే. భవిష్యత్తు ప్రణాళికలేమిటో తామే చెప్పేవాళ్లమని చెప్పాడు. రాస్ ను ఎప్పుడు అడిగినా ఏమీ లేదనేవాడని విమర్శించాడు. ఒక్క పదం కూడా మాట్లాడేవాడని వాడు కెప్టెన్సీకి ఎలా అర్హుడు అవతాడని ఆయన ప్రశ్నించాడు. దాంతో తమ జట్టు కోచ్ నిత్యం అయోమయంలో పడేవాడని మెక్ కల్లమ్ చెప్పుకోచ్చాడు..

రాస్ ఎందుకు ఇలా చేసేవాడో తమకు తెలియదని, అయితే జట్టును ఎప్పుడూ సరైన రీతిలో పెట్టలేకపోయేవాడని మాత్రం తాను చెప్పగలన్నాడు. అతని ఆలోచల్ని కూడా జట్టు సభ్యులతో పంచుకునేవాడు కాదని మెకల్లమ్ పేర్కోన్నాడు. అయితే రాస్ టేలర్ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి తాను ఎంతమాత్రం కారణం కాదని తెలిపాడు. అలాంటి పరిస్థితులకు తాను పూర్తిగా వ్యతిరేకమంటూనే.. డేనియల్ వెటోరికీ న్యూజిలాండ్ కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పడాన్ని మాత్రం మెకల్లమ్ పరోక్షంగా విమర్శించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs new zealand  new zealand  mc cullum  ross taylor  cricket  

Other Articles