క్రికెట్లో అప్పటి వరకు ఎవరికీ తెలియని వాళ్లు, ఒక మంచి ప్రదర్శనతో హీరోలయిపోతుంటారు. ఇంకేముంది వాళ్ల వెంట ప్రముఖ కంపెనీలన్నీ ప్రకటనలు చేయమని వెంటబడుతుంటాయి. కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం.. ప్రకటనలు చేయడం చకచకా జరిగిపోతుంటుంది. అయితే ఒక్కోసారి క్రికెటర్లు చేసిన ప్రకటనలే వారి కొంపముంచుతాయి. షంఘంలో పేరు ప్రఖ్యాతులు రాగానే ఒకటి రెండు పర్యాయాలు వాటికి భంగం కలగకుండా జాగ్రత్తాలు తీసుకోవాలని లేకపోతే అబాసుపాలు కాకతప్పదు.
సరిగ్గా ఇదే పరిస్థితి బంగ్లాదేశ్ యువ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్(24)కు ఎదురైంది. ‘ఆస్కార్’ అనే ఆల్కాహాల్ రహిత డ్రింక్ ప్రకటనలో నటించడంతో అతడిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ ప్రకటలోని ఘాటు సంభాషణలపై సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో తీవ్ర విమర్శలు రావడంతో బోర్డు దీనిపై స్పందించింది. ఆ ప్రకటనను తక్షణమే నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించింది. ఈ ప్రకటనలో షబ్బీర్‌తో పాటు ప్రముఖ బంగ్లాదేశీ మోడల్ నైలా నయీమ్(34) కూడా నటించింది. ఇంతకీ ఈ ప్రకటనలో ఏముందో ఈ వీడియోలో చూడండి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more