భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న సిరీస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. సుదీర్ఘ పర్యటన కోసం దేశంలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈనెల 9 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు బిసిసిఐ క్షమాపణలు కోరింది. అదేంటి అనుకుంటున్నారా..? మ్యాచ్ ప్రారంభానికి ముందు క్షమాపణలు చెప్పాల్సిన అవసరమేంటన్న డౌట్స్ కలుగుతున్నాయా..?
ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచుల ఆడాలని ముందస్తు ప్రణాళికతో భారత్ లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. వారి ఖర్చులను వారే భరించేలా కోరుతూ బిసిసిఐ ఈసీబికి లేఖ రాసింది. ఎందుకంటారా..? భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) లోథా కమిటీ సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయలేమని చెప్పింది. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఖర్చులను బోర్డు భరించలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాస్తూ ఇంగ్లండ్ క్రికెటర్ల హోటల్, ప్రయాణ ఖర్చులను వారే పెట్టుకోవాలని లేఖ రాసింది.
ఒకవేళ తాము ఇంగ్లాండ్ ఆటగాళ్ల బిల్లులు చెల్లిస్తే ఆ మొత్తం బోర్డుకు తిరిగివ్వాలని బీసీసీఐ పేర్కొంది. అయితే, ఈసీబీ ప్రతినిధి మాత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే భారత్, ఇంగ్లండ్ సిరీస్ నిర్వహిస్తామని చెప్పారు. అయితే, లోథా ప్యానెల్, బీసీసీఐ మధ్య వివాదం మరింత చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నట్లు, ఈ ప్రభావం సిరీస్ పై పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిధులు విడుదల కాకపోతే సిరీస్ నిర్వహించడం సాధ్యం కాదంటూ బీసీసీఐ లోథా ప్యానెల్‌ని విమర్శిస్తోన్న నేపథ్యంలో స్పందించిన కమిటీ, ఇంగ్లండ్‌తో సిరీస్ రద్దు అయితే, దానికి కారణం తమది కాదని, బోర్డుదే అవుతుందని తేల్చిచెప్పింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more