భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న సిరీస్ పై తుది వరకు కమ్ముకున్న నీలినీడలు ఎట్టకేలకు వైదోలగగా, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బిసిసిఐకి స్వల్ప ఊరట లభించింది. సుదీర్ఘ పర్యటన కోసం భారత్ లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి తమ ఖర్చులు తామే పెట్టుకోవాలని లేఖ రాయడంతో ఊహించని పరిణామాలు ఎదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్ నేపథ్యంలో టెస్టుకు ఎలాంటి విఘాతం కల్గకుండా అత్యున్నత న్యాయస్థానం చర్యలు తీసుకుంది.
రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టు మ్యాచ్‌కు లైన్ క్లియరైంది. ఈ టెస్టు నిర్వహించడానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో బీసీసీఐలో నెలకొన్న టెన్షన్ కు పుల్ స్టాప్ పడింది. నిధుల లేమితో మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితులను తెలుపుతూ తమ గోడును బిసిపిఐ సుప్రీంకోర్టుకు వెల్లబోసుకుంది. బీసీసీఐ సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు ఈ విషయంలో సానుకూలంగా స్పందించింది. నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది.
వెంటనే రాజ్‌కోట్ టెస్టు మ్యాచుకు రూ. 58.66 లక్షలు విడుదల చేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపటి మ్యాచ్‌పై సందిగ్ధత తొలగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మొదటి టెస్టు మ్యాచు జరగనుంది. కాగా, బిసిసిఐ పెద్దలు రాజ్ కోట్ వెళ్లేందుకు మాత్రం నిధులను సుప్రీం విడుదల చేయలేదు. దీంతో రేపటి మ్యాచ్ పై స్పల్ప ఊరట లభించినట్లైంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more