మొహాలీ టెస్టు: భారత్ ను అదుకున్న ఇద్దరు అల్ రౌండర్లు.. Ashwin, Jadeja get INDIA close to lead

India vs england 3rd test mohali day 2 ashwin jadeja get india close to lead

india vs england, ICC, virat kohli, alastait cook, mohali test, Shami, ashwin, jadeja ind vs england, ind vs eng, india vs england third test, india vs england mohali test, india vs england alastair cook, ind vs eng cook, cricket news, sports news

Ravichandran Ashwin displayed his utility as a batsman as he notched up his ninth Test fifty. He was ably supported by Ravindra Jadeja as they shared a 67-run partnership.

మొహాలీ టెస్టు: భారత్ ను అదుకున్న ఇద్దరు అల్ రౌండర్లు..

Posted: 11/27/2016 05:57 PM IST
India vs england 3rd test mohali day 2 ashwin jadeja get india close to lead

పర్యాటక జట్టుతో మొహాలీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అటగాళ్లు కూడా తడబాటుకు గురయ్యారు. టాప్ అర్డర్ లో పార్థివ్ పటేల్ పర్వాలేదని అనిపించినా.. చత్తీశ్వర్ పూజారాతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీలు అర్థసెంచరీ చేసినా.. ఇంగ్లాండ్ పై పైచేయి సాధించడంలో కొంత వెనకంజ వేశారు. ఈ క్రమంలో భారత బ్యాట్స్ మెన్లు వరుసగా వికెట్లు కోల్పోతున్న క్రమంలో అల్ రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల మధ్య చక్కని భాగస్వామ్యం జట్టును అదుకుంది.

దీంతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్కోరును సమం చేసేందుకు భారత్‌ ఇంకా 12 పరుగులు చేయాల్సి ఉంది. అశ్విన్‌ 57 పరుగులు, జడేజా 31 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. అంతకుముందు 268/8 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 283 పరుగుల వద్ద ఆలౌటైంది. మరో 15 పరుగులు మాత్రమే సాధించి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇండియా.. తొలి రెండు సెషన్లలో అత్యంత నిలకడ ప్రదర్శించింది. ఆ తరువాత మూడో సెషన్లో మాత్రం వరుసగా కీలక వికెట్లను కోల్పోయింది. టీ విరామానికి రెండు వికెట్లు కోల్పోయి 148 పరుగులతో పటిష్ట స్థితిలో కనిపించిన భారత్.. ఆ సెషన్ ముగిసిన వెంటనే చటేశ్వర పూజారా(51;104 బంతుల్లో 8 ఫోర్లు) వికెట్ ను కోల్పోయింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో అజింక్యా రహానే డకౌట్గా అవుట్ కాగా, మరో నాలుగు పరుగుల తేడాలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కరణ్ నాయర్(4) రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

మరొకవైపు తన సహజశైలికి భిన్నంగా ఆటను కొనసాగించిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. రవి చంద్రన్ అశ్విన్ తో కలిసి 48 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. కాగా,విరాట్ (62; 127 బంతుల్లో 9ఫోర్లు)ను బెన్ స్టోక్స్ వేసిన బంతిని షాట్ కోట్టబోయి ఎడ్జ్ కావడంతో క్యాచ్ ఇచ్చి పెవీలియన్ కు చేరాడు. దాంతో 204 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ ను కోల్పోయింది. అంతకుముందు మురళీ విజయ్ (12), పార్థీవ్ పటేల్ (42)లు పెవిలియన్ చేరారు. అశ్విన్‌, జడేజా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ తొలి ఇన్నింగ్స్లో భారత్‌కు ఆధిక్యం లభించే దిశగా బ్యాటింగ్ సాగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  alastait cook  Shami  mohali test  cricket  

Other Articles