పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా పేస్ బౌలర్ మొహ్మద్ షమీ పంబరేపాడు. పేస్ కు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఇంగ్లాండ్ జట్టును తన పేస్ తో షమీ బంబేలుత్తించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు పదునైన ఫుల్ లెంగ్త్ బంతులను సంధిస్తునే, మరొకవైపు బౌన్సర్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లను హడలెత్తించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో షమీ సాధించిన రెండు వికెట్లు బౌనర్లను సంధించి తీసినవే కావడం విశేషం.
ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ను ఇవాళ కొనసాగించిన ఇంగ్లాండ్.. మధ్యలో కొంత నిలదోక్కుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొత్త బంతిని అందుకోగానే షమీ తనలోని ప్రతిభను కనబర్చాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 84.0 ఓవర్ ను వేసిన షమీ తొలి బంతినే వోక్స్‌కు బౌన్సర్‌గా సంధించాడు. దాంతో వోక్స్ తడబడటంతో ఆ బంతి కాస్త అతని హెల్మెట్‌ను బలంగా తగిలింది. అదే క్రమంలో అతని హెల్మెట్‌కు ఉన్న నెక్ గార్డ్ కూడా ఎగిరికిందపడింది.
అయితే వోక్స్‌కు ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అదే ఓవర్ రెండో బంతి మరోసారి షమీ బౌన్సర్ వేశాడు. ఈ బంతిని ఆడటానికి మరోమారు ఆందోళనకు గురైన వోక్స్(30).. భారత వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, ఆ తరువాత నాల్గో బంతికి క్రీజ్‌లోకి వచ్చిన రషిద్ ను కూడా బౌన్సర్ తో షమీ బొల్తా కొట్టించాడు. ఆ బంతిని ఆడబోయి ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇలా తన వంతుగా కూడా షమీ టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more