హసీబ్ హమీద్ పై కోహ్లీ ప్రశంసలు Brave Hameed earns plaudits before heading home

Brave hameed earns plaudits before heading home

india vs england, virat kohli, kohli, mohali test, Haseeb Hameed, Parthiv Patel, mohammed shami, kp, virat kohli vs joe root, kohli vs root, india vs england, ind vs eng, england vs india, cricket, cricket news, sports, sports news

Hameed had to alter his grip to be able to bat in what Cook described as "a very special knock" while India captain Virat Kohli was also impressed.

హసీబ్ హమీద్ పై కోహ్లీ ప్రశంసలు

Posted: 11/30/2016 06:46 PM IST
Brave hameed earns plaudits before heading home

పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తన టెస్టు కెరీర్ ను అరంగ్రేటం చేయడానికి ఇండియాకు వచ్చిన హసీబ్ హమీద్.. అటు స్వదేశీ జట్టుతో పాటు ఇటు భారతీయ క్రిడాభిమానుల హృదయాలను కూడా కోల్లగోట్టాడు. అంతర్జాతీయంగా టెస్టు కెరీర్ ప్రారంభించిన తొలి మ్యాచ్ లోనే 82 పరుగులు చేసిన భారతీయ సంతతికి చెందిన యువ క్రికెటర్.. గాయం కారణంగా మిగిలిన రెండు టెస్టులకు దూరం కానున్నాడు.

టీమిండియాతో మూడు టెస్టులు అడిన హమీద్.. మొత్తంగా 43.8 సగటుతో 210 పరుగులను సాధించాడు. అయితే మూడవ టెస్టులో తన చేతికి గాయం కావడంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన హసీబ్ తాను ఏం చేయాలనుకుంటున్నాడో.. అదే చేశాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తన జట్టు కెప్టెన్ సంశయిస్తున్నా.. జట్టు క్రమంగా వికెట్లను కోల్పోతున్న సమయంలో.. ఎనమిదవ వికెట్ తో కలసి పరుగుల చేయడం చాలా కష్టం. కానీ హాసీబ్ చేసి మెప్పించాడని కోహ్లీ కొనియాడాడు.

తన బ్యాటింగ్ శైలిని మరింత మెరుగ్గా ఎలా మలచుకోవాలో చెప్పాలంటూ కోహ్లీని అడిగాడు. దీంతో కోహ్లీ పలు సూచనలు చేశాడు. కోహ్లీ చెబుతున్నంతసేపూ హమీద్ క్రమశిక్షణ కలిగిన విద్యార్థిలా శ్రద్ధగా విన్నాడు. వీరిద్దరి మధ్య సంభాషణ సందర్భంగా తీసిన ఫోటోను బీసీసీఐ 'తరం మారింది, అంతరాలు కూడా మారాయి' అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇది క్రీడాభిమానులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ హసీబ్ పై ప్రశంసలు కూడా కురిపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  virat kohli  Haseeb Hameed  Team india  mohali test  

Other Articles