ప్రియురాలిని పరిణయమాడిన ఇషాంత్ శర్మ.. Bravo controversy typical of current West Indies culture: Richards

Cricketer ishant sharma ties the knot to basketball player

Ishant Sharma wedding, Pratima Singh, yuvraj singh

Team India pacer Ishant sharma got hitched to the basketball player Pratima Singh in an intimate ceremony in the capital. The couple reportedly met in 2011 when Ishant was invited as the

ప్రియురాలిని పరిణయమాడిన ఇషాంత్ శర్మ

Posted: 12/10/2016 04:40 PM IST
Cricketer ishant sharma ties the knot to basketball player

ఐదేళ్ల క్రితం అమెను కలిశాడు. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా పరిణయానికి దారి తీసింది. ఇంకేముంది కళ్యాణ గడియాలు రావడం వారిద్దరికీ వివాహం జరిగిపోయింది. ఎవరి గురించి చెబుతున్నామో అని అలోచనలో పడ్డారా..? అమె పేరు ప్రతిమా సింగ్. అమె బాస్కెట్ బాల్ క్రీడాకారిణి. ఇలా చెబితే కష్టమే కానీ, ప్రస్తుతం టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ సహధర్మచారిణి అంటే బాగా గుర్తు పడతారు. ఇప్పుడు పైన చెప్పిన ఉపోద్ఘాతమంతా ఎవరి గురించో అర్థమైంది కదూ. అవునండీ ఇషాంత్ శర్మ క్రితం రోజున ఇంటివాడయ్యాడు.

వారణాసికి చెందిన ప్రతిమా సింగ్.. గతంలో భారత జాతీయ బాస్కెట్ బాల్ జట్టు తరపున అనేక మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించింది. దాంతో పాటు కెప్టెన్ గా కూడా వ్యహరించింది. 2011లో ప్రతిమను బాస్కెట్ బాల్ ఈవెంట్ లో ఇషాంత్ తొలిసారి చూశాడు. ఆ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్లిన ఇషాంత్.. ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ రకంగా వారి మద్య చిగురించిన ప్రేమ పరిణయంతో శాశ్వత బంధంగా ముడివేసుకుంది. ఈ ఏడాది జూన్ లో వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరుగగా.. క్రితం రోజున వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేద్ర సింగ్ ధోనితో పాటు టీమిండియాలో కొత్త పెళ్లికోడుకైన యువరాజ్ సింగ్ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ishant Sharma  wedding  Pratima Singh  yuvraj singh  

Other Articles