టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా చోరవ తీసుకుని మరీ కాపాడాలని అస్ట్రిలియా స్పిన్నర్ నాథన్ లయాన్ అభిప్రాయపడ్డాడు. పింక్ బాల్‌తో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ల నిర్వహణలో అతిగా వెళ్లకుండా ఉంటేనే మంచిదంటూ సలహా ఇచ్చాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదంటూనే, డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ వల్ల అంతగా ఉపయోగం లేదన్నాడు.
ఎక్కువ శాతంలో డే అండ్ నైట్ టెస్టులు నిర్వహించాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నాట్టు చెప్పాడు. ఇప్పటికే అడిలైడ్‌లో నిర్వహించిన పింక్ బాల్ మ్యాచ్ మంచి సక్సెస్ అయ్యింది. కానీ టెస్టు క్రికెట్ సంప్రదాయాన్ని రక్షించడం కూడా ముఖ్యమే. పింక్ బాల్ తో గేమ్‌లు నిర్వహిస్తే టెస్టు క్రికెట్‌కు హాని జరిగే అవకాశం ఉంది. దాంతో పింక్ బాల్ గేమ్‌ను సాధ్యమైనంత తక్కువగా నిర్వహిస్తేనే మంచిది. డే అండ్ నైట్ టెస్టుల నిర్వహణపై అతిగా వెళ్లకండని లయాన్ తెలిపాడు.
ఈ మేరకు వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌లో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ కు సీఏ ఆమోదం తెలపడాన్ని తప్పుబట్టాడు. యాషెస్‌లో డే అండ్ నైట్ టెస్టును తాను కోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతేడాది వేసవిలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య అడిలైడ్ లో తొలి డే అండ్ నైట్ టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వెస్టిండీస్-పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్‌లో డే అండ్ నైట్ టెస్టును నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ నాల్గో టెస్టును డే అండ్ నైట్ మ్యాచ్ గా ఆడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more