టీమిండియా విధ్వంసకర బ్యాట్స్ మెన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మరిన్ని మెరుగులు దిద్దుకోవాల్సిన అవసముందని టీమిండియా మాజీ కెప్టెన్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇటీవలే సెలక్షన్ కమిటీ పగ్గాలను చేపట్టిన తెలుగువాడు ఎంఎస్కే ప్రసాద్ కు విరాట్ కోహ్లీ విషయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కోంటున్నారని అన్నారు. అదేంటంటే కోహ్లీకి మూడు ఫార్మెట్ల కెప్టెన్సీ పగ్గాలను అందించాలన్నదేనని చెప్పారు. అయితే.. ఇలా తలెత్తే డిమాండ్లపై సెలక్షన్ కమిటీ తలొగ్గకూడదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
గత రెండేళ్లుగా టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లి అసాధారణమైన ప్రతిభను చాటుతున్నాడని.. అయన అద్భుతమైన అటగాడని అందులో ఎలాంటి సందేహం లేదని, అయితే మూడు ఫార్మెట్ల కెప్టెన్ గా ఎదిగేందుకు ఆయనకు ఇంకా కొంచెం సమయం కావాలని అన్నాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీలో ఇంకా మెరుగులు దిద్దుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా వుందని అన్నాడు. కోహ్లీ కెప్టెన్సీకి పదికి గాను ఎన్ని మార్కులు వేస్తారని ప్రశ్నించగా, ఏడు నుంచి ఏడున్నర మార్కులు మాత్రమే వేస్తానని గవాస్కర్ తేల్చిచెప్పాడు.
2016 నుంచి బ్యాటుతో కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడుతున్నాడని కితాబునిచ్చారు. ప్రపంచంలోని ఏ పిచ్ అయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్న కోహ్లీ కేవలం ఇంగ్లండ్ లోనే రాణించలేదని తెలిపాడు. కోహ్లీకి మార్కులు వేయాల్సి వస్తే పదికి ఏడు మార్కులు వేస్తానని తెలిపారు. మరికొన్ని విభాగాల్లో కోహ్లీ పరిణతి సాధించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దీనికి మరికొంత అనుభవం అవసరమని ఆయన చెప్పారు. ఇంగ్లండ్ లో కూడా కోహ్లీ రాణించి సత్తాచాటుతాడని, అది త్వరలోనే జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more